Ephesians · chapter 5 · verse 9
Ephesians 5:9 in Telugu
వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
Velugu phalamu samastavidhamulaina manchitanamu, neeti, satyamanu vaatilo kanabaduchunnadi.
Ephesians 5:9 in English
- King James Version (KJV)
- (For the fruit of the Spirit [is] in all goodness and righteousness and truth;)
- World English Bible (WEB)
- for the fruit of the Spirit is in all goodness and righteousness and truth,
- American Standard Version (ASV)
- (for the fruit of the light is in all goodness and righteousness and truth),
- Bible in Basic English (BBE)
- (Because the fruit of the light is in all righteousness and in everything which is good and true),
- Darby Translation (DBY)
- (for the fruit of the light [is] in all goodness and righteousness and truth,)
- Webster's Bible (WBS)
- (For the fruit of the Spirit [is] in all goodness, and righteousness, and truth;)
- Young's Literal Translation (YLT)
- for the fruit of the Spirit [is] in all goodness, and righteousness, and truth,
Read in context
- 7గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.
- 8మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
- 9వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
- 10గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
- 11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
Cross references
- Galatians 5:22–23 గలతీయులకు 5:22–23అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
- 3 John 1:11 3 యోహాను 1:11ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
- 1 John 3:9–10 1 యోహాను 3:9–10దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
- Romans 15:14 రోమీయులకు 15:14నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను.
- Ephesians 6:14 ఎఫెసీయులకు 6:14ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని
- 1 Timothy 6:11 1 తిమోతికి 6:11దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
- Philippians 1:11 ఫిలిప్పీయులకు 1:11వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
- Psalm 16:2–3 కీర్తనలు 16:2–3నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
- 1 Peter 2:24–25 1 పేతురు 2:24–25మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
- Romans 2:4 రోమీయులకు 2:4లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
- Ephesians 4:15 ఎఫెసీయులకు 4:15ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
- 1 John 2:29 1 యోహాను 2:29ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.