Exodus · chapter 19 · verse 20
Exodus 19:20 in Telugu
యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
Yehovaa seenaayi parvatamumeediki, anagaa aa parvata shikharamumeediki digi vachchenu. Yehovaa parvata shikharamumeediki rammani moshenu piluvagaa moshe ekkipoyenu
Exodus 19:20 in English
- King James Version (KJV)
- And the LORD came down upon mount Sinai, on the top of the mount: and the LORD called Moses [up] to the top of the mount; and Moses went up.
- World English Bible (WEB)
- The LORD came down on Mount Sinai, to the top of the mountain. The LORD called Moses to the top of the mountain, and Moses went up.
- American Standard Version (ASV)
- And Jehovah came down upon mount Sinai, to the top of the mount: and Jehovah called Moses to the top of the mount; and Moses went up.
- Bible in Basic English (BBE)
- Then the Lord came down on to Mount Sinai, to the top of the mountain, and the Lord sent for Moses to come up to the top of the mountain, and Moses went up.
- Darby Translation (DBY)
- And Jehovah came down on mount Sinai, on the top of the mountain; and Jehovah called Moses to the top of the mountain, and Moses went up.
- Webster's Bible (WBS)
- And the LORD came down upon mount Sinai, on the top of the mount: and the LORD called Moses to the top of the mount; and Moses went up.
- Young's Literal Translation (YLT)
- And Jehovah cometh down on mount Sinai, unto the top of the mount, and Jehovah calleth for Moses unto the top of the mount, and Moses goeth up.
Read in context
- 18యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
- 19ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
- 20యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
- 21అప్పుడు యెహోవాప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.
- 22మరియు యెహోవా వారిమీద పడకుండునట్లు యెహోవాయొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధ పరచుకొన వలెనని మోషేతో చెప్పగా
Cross references
- Nehemiah 9:13 నెహెమ్యా 9:13సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.
- Exodus 19:3 నిర్గమకాండము 19:3మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా
- Exodus 34:2 నిర్గమకాండము 34:2ఉదయము నకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను.
- Exodus 24:18 నిర్గమకాండము 24:18అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
- Exodus 24:12–13 నిర్గమకాండము 24:12–13అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
- Exodus 34:4 నిర్గమకాండము 34:4కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతిపలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా
- Psalm 81:7 కీర్తనలు 81:7ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని. (సెలా. )
- Exodus 19:11 నిర్గమకాండము 19:11మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
- Deuteronomy 9:9 ద్వితీయోపదేశకాండము 9:9ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధ మైన పలకలను తీసికొను టకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.