Exodus · chapter 2 · verse 8
Exodus 2:8 in Telugu
అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.
Anduku pharo kumaarte vellumani cheppagaa aa chinnadi velli aa bidda tallini piluchukoni vachchenu.
Exodus 2:8 in English
- King James Version (KJV)
- And Pharaoh’s daughter said to her, Go. And the maid went and called the child’s mother.
- World English Bible (WEB)
- Pharaoh’s daughter said to her, “Go.” The young woman went and called the child’s mother.
- American Standard Version (ASV)
- And Pharaoh’s daughter said to her, Go. And the maiden went and called the child’s mother.
- Bible in Basic English (BBE)
- And Pharaoh's daughter said to her, Go. And the girl went and got the child's mother.
- Darby Translation (DBY)
- And Pharaoh's daughter said to her, Go. And the damsel went and called the child's mother.
- Webster's Bible (WBS)
- And Pharaoh's daughter said to her, Go. And the maid went and called the child's mother.
- Young's Literal Translation (YLT)
- and the daughter of Pharaoh saith to her, 'Go;' and the virgin goeth, and calleth the mother of the lad,
Read in context
- 6తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.
- 7అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను.
- 8అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.
- 9ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.
- 10ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.
Cross references
- Psalm 27:10 కీర్తనలు 27:10నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.
- Isaiah 46:3–4 యెషయా 46:3–4యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
- Exodus 6:20 నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Ezekiel 16:8 యెహెజ్కేలు 16:8మరియు నేను నీయొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతో నిబంధనచేసికొనగా నీవు నా దాన వైతివి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.