Exodus · chapter 3 · verse 21
Exodus 3:21 in Telugu
జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.
Janula yedala aigupteeyulaku kataakshamu kalugajesedanu ganuka meeru vellunappudu vattichetulato vellaru.
Exodus 3:21 in English
- King James Version (KJV)
- And I will give this people favour in the sight of the Egyptians: and it shall come to pass, that, when ye go, ye shall not go empty:
- World English Bible (WEB)
- I will give this people favor in the sight of the Egyptians, and it will happen that when you go, you shall not go empty-handed.
- American Standard Version (ASV)
- And I will give this people favor in the sight of the Egyptians: and it shall come to pass, that, when ye go, ye shall not go empty.
- Bible in Basic English (BBE)
- And I will give this people grace in the eyes of the Egyptians, so that when you go out you will go out with your hands full.
- Darby Translation (DBY)
- And I will give this people favour in the eyes of the Egyptians, and it shall come to pass, when ye go out, that ye shall not go out empty;
- Webster's Bible (WBS)
- And I will give this people favor in the sight of the Egyptians: and it shall come to pass, that when ye go, ye shall not go empty:
- Young's Literal Translation (YLT)
- 'And I have given the grace of this people in the eyes of the Egyptians, and it hath come to pass, when ye go, ye go not empty;
Read in context
- 19ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
- 20కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
- 21జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.
- 22ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
Cross references
- Exodus 12:36 నిర్గమకాండము 12:36యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
- Exodus 11:3 నిర్గమకాండము 11:3యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.
- Psalm 105:37 కీర్తనలు 105:37అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
- Proverbs 16:7 సామెతలు 16:7ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
- Psalm 106:46 కీర్తనలు 106:46వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
- Acts 7:10 అపొస్తలుల కార్యములు 7:10దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
- Genesis 39:21 ఆదికాండము 39:21అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.
- Nehemiah 1:11 నెహెమ్యా 1:11యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అను గ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.