Exodus · chapter 33 · verse 2
Exodus 33:2 in Telugu
నేను నీకు ముందుగా దూతను పంపి కనానీ యులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.
Nenu neeku mundugaa dootanu pampi kanaanee yulanu amoreeyulanu hitteeyulanu perijjeeyulanu hivveeyulanu yebooseeyulanu vellagottedanu.
Exodus 33:2 in English
- King James Version (KJV)
- And I will send an angel before thee; and I will drive out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite:
- World English Bible (WEB)
- I will send an angel before you; and I will drive out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite.
- American Standard Version (ASV)
- and I will send an angel before thee; and I will drive out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite:
- Bible in Basic English (BBE)
- And I will send an angel before you, driving out the Canaanite and the Amorite and the Hittite and the Perizzite and the Hivite and the Jebusite:
- Darby Translation (DBY)
- (and I will send an angel before thee, and dispossess the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite,)
- Webster's Bible (WBS)
- And I will send an angel before thee; and I will drive out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite:
- Young's Literal Translation (YLT)
- (and I have sent before thee a messenger, and have cast out the Canaanite, the Amorite, and the Hittite, and the Perizzite, the Hivite, and the Jebusite,)
Read in context
- 1మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసినీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.
- 2నేను నీకు ముందుగా దూతను పంపి కనానీ యులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను.
- 3మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషేతో చెప్పెను.
- 4ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
Cross references
- Joshua 24:11 యెహోషువ 24:11మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.
- Exodus 32:34 నిర్గమకాండము 32:34కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించెదనని మోషేతో చెప్పెను.
- Exodus 3:8 నిర్గమకాండము 3:8కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.
- Exodus 23:20 నిర్గమకాండము 23:20ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.
- Exodus 23:27–31 నిర్గమకాండము 23:27–31నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశములవారిని ఓడ గొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను. మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టను. దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను. నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను. మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.
- Deuteronomy 7:22 ద్వితీయోపదేశకాండము 7:22నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమ ముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరముకాదు.
- Exodus 3:17 నిర్గమకాండము 3:17ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
- Exodus 34:11 నిర్గమకాండము 34:11నేడు నేను నీ కాజ్ఞా పించుదానిననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీ యులను కనానీయులను హిత్తీ యులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను.