Exodus · chapter 34 · verse 22
Exodus 34:22 in Telugu
మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.
Mariyu neevu godhumalakotalo prathama phalamula panduganu, anagaa vaaramula panduganu sanvatsa raantamandu pantakoorchu panduganu aacharimpavalenu.
Exodus 34:22 in English
- King James Version (KJV)
- And thou shalt observe the feast of weeks, of the firstfruits of wheat harvest, and the feast of ingathering at the year’s end.
- World English Bible (WEB)
- “You shall observe the feast of weeks with the first fruits of wheat harvest, and the feast of harvest at the year’s end.
- American Standard Version (ASV)
- And thou shalt observe the feast of weeks, [even] of the first-fruits of wheat harvest, and the feast of ingathering at the year’s end.
- Bible in Basic English (BBE)
- And you are to keep the feast of weeks when you get in the first-fruits of the grain, and the feast at the turn of the year when you take in the produce of your fields.
- Darby Translation (DBY)
- — And thou shalt observe the feast of weeks, of the first-fruits of wheat-harvest, and the feast of ingathering at the turn of the year.
- Webster's Bible (WBS)
- And thou shalt observe the feast of weeks, of the first-fruits of wheat-harvest, and the feast of in-gathering at the year's end.
- Young's Literal Translation (YLT)
- 'And a feast of weeks thou dost observe for thyself; first-fruits of wheat-harvest; and the feast of in-gathering, at the revolution of the year.
Read in context
- 20గొఱ్ఱెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను, దాని విమోచింపనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను, నా సన్నిధిని వారు పట్టిచేతులతో కనబడవలదు.
- 21ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.
- 22మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.
- 23సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కన బడవలెను
- 24ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.
Cross references
- Exodus 23:16 నిర్గమకాండము 23:16నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.
- Deuteronomy 16:10–15 ద్వితీయోపదేశకాండము 16:10–15నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
- John 7:2 యోహాను 7:2యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక
- Numbers 28:16–31 సంఖ్యాకాండము 28:16–31మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ. ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తిన వలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయ కూడదు అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టే లుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱె పిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్ప ణమును గాక దానిని అర్పించవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయ బడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.
- Acts 2:1 అపొస్తలుల కార్యములు 2:1పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
- Numbers 29:12–39 సంఖ్యాకాండము 29:12–39మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను. నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింవలెను. రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధిప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణము లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడె లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు. అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింవలెను.