Exodus · chapter 5 · verse 2
Exodus 5:2 in Telugu
ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.
Pharo nenu atani maata vini ishraayeleeyulanu ponichchutaku yehovaa evadu? Nenu yehovaanu eruganu, ishraayeleeyulanu poneeyananenu.
Exodus 5:2 in English
- King James Version (KJV)
- And Pharaoh said, Who [is] the LORD, that I should obey his voice to let Israel go? I know not the LORD, neither will I let Israel go.
- World English Bible (WEB)
- Pharaoh said, “Who is the LORD, that I should listen to his voice to let Israel go? I don’t know the LORD, and moreover I will not let Israel go.”
- American Standard Version (ASV)
- And Pharaoh said, Who is Jehovah, that I should hearken unto his voice to let Israel go? I know not Jehovah, and moreover I will not let Israel go.
- Bible in Basic English (BBE)
- And Pharaoh said, Who is the Lord, to whose voice I am to give ear and let Israel go? I have no knowledge of the Lord and I will not let Israel go.
- Darby Translation (DBY)
- And Pharaoh said, Who is Jehovah, to whose voice I am to hearken to let Israel go? I do not know Jehovah, neither will I let Israel go.
- Webster's Bible (WBS)
- And Pharaoh said, Who [is] the LORD, that I should obey his voice to let Israel go? I know not the LORD, neither will I let Israel go.
- Young's Literal Translation (YLT)
- and Pharaoh saith, 'Who [is] Jehovah, that I hearken to His voice, to send Israel away? I have not known Jehovah, and Israel also I do not send away.'
Read in context
- 1తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
- 2ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.
- 3అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము; లేని యెడల ఆయన మా మీద తెగులుతోనునైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.
- 4అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపు చున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
Cross references
- Exodus 3:19 నిర్గమకాండము 3:19ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
- Job 21:15 యోబు 21:15మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
- 2 Kings 18:35 2 రాజులు 18:35యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.
- John 16:3 యోహాను 16:3వారు తండ్రిని నన్నును తెలిసికొన లేదు గనుక ఈలాగు చేయుదురు.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- 2 Thessalonians 1:8 2 థెస్సలొనీకయులకు 1:8మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
- Psalm 14:1 కీర్తనలు 14:1దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
- Psalm 12:4 కీర్తనలు 12:4మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.
- 2 Chronicles 32:19 2 దినవృత్తాంతములు 32:19మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
- 1 Samuel 2:12 1 సమూయేలు 2:12ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.
- Jeremiah 44:16–17 యిర్మీయా 44:16–17మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము, మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.
- 2 Chronicles 32:15 2 దినవృత్తాంతములు 32:15కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవు డైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.