Ezekiel · chapter 14 · verse 10
Ezekiel 14:10 in Telugu
ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును.
Ishraayeleeyulu ikanu nannu visarjinchi tolagipovakayu taamu cheyu atikramamulanniticheta tammunu apavitraparachukonakayu nundi, naa janulagunatlunu nenu vaariki devudanaiyundu natlunu.
Ezekiel 14:10 in English
- King James Version (KJV)
- And they shall bear the punishment of their iniquity: the punishment of the prophet shall be even as the punishment of him that seeketh [unto him;]
- World English Bible (WEB)
- They will bear their iniquity. The iniquity of the prophet will be even as the iniquity of him who seeks him,
- American Standard Version (ASV)
- And they shall bear their iniquity: the iniquity of the prophet shall be even as the iniquity of him that seeketh [unto him];
- Bible in Basic English (BBE)
- And the punishment of their sin will be on them: the sin of the prophet will be the same as the sin of him who goes to him for directions;
- Darby Translation (DBY)
- And they shall bear their iniquity: the iniquity of the prophet shall be even as the iniquity of the inquirer;
- Webster's Bible (WBS)
- And they shall bear the punishment of their iniquity: the punishment of the prophet shall be even as the punishment of him that seeketh [to him] ;
- Young's Literal Translation (YLT)
- And they have borne their iniquity: as the iniquity of the inquirer, so is the iniquity of the prophet;
Read in context
- 8ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 9మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలముచేసెదను
- 10ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును.
- 11వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు.
- 12మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Cross references
- Ezekiel 23:49 యెహెజ్కేలు 23:49నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.
- Ezekiel 14:7–8 యెహెజ్కేలు 14:7–8ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశుల లోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను. ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసెదను.
- Ezekiel 17:18–20 యెహెజ్కేలు 17:18–20తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే, అతడు ఎంతమాత్రమును తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరచిన నిబంధన నేను చేసినదే గదా, నా జీవముతోడు ఆ దోషశిక్ష అతని తలమీదనే మోపుదును, అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.
- Numbers 5:31 సంఖ్యాకాండము 5:31అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.
- Revelation 19:19–21 ప్రకటన 19:19–21మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- Jeremiah 6:14–15 యిర్మీయా 6:14–15సమాధానములేని సమయమునసమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Galatians 6:5 గలతీయులకు 6:5ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?
- Deuteronomy 17:2–7 ద్వితీయోపదేశకాండము 17:2–7నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
- Jeremiah 14:15 యిర్మీయా 14:15కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.
- Jeremiah 8:11–12 యిర్మీయా 8:11–12సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు
- Ezekiel 14:4 యెహెజ్కేలు 14:4కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరు