Ezekiel · chapter 16 · verse 46
Ezekiel 16:46 in Telugu
నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.
Nee yedama prakkanu nivasinchu shomronunu daani kumaartelunu neeku akkalu, nee kudiprakkanu nivasinchu sodomayu daani kumaartelunu neeku chellendru.
Ezekiel 16:46 in English
- King James Version (KJV)
- And thine elder sister [is] Samaria, she and her daughters that dwell at thy left hand: and thy younger sister, that dwelleth at thy right hand, [is] Sodom and her daughters.
- World English Bible (WEB)
- Your elder sister is Samaria, who dwells at your left hand, she and her daughters; and your younger sister, who dwells at your right hand, is Sodom with her daughters.
- American Standard Version (ASV)
- And thine elder sister is Samaria, that dwelleth at thy left hand, she and her daughters; and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
- Bible in Basic English (BBE)
- Your older sister is Samaria, living at your left hand, she and her daughters: and your younger sister, living at your right hand, is Sodom and her daughters.
- Darby Translation (DBY)
- And thine elder sister is Samaria that dwelleth at thy left hand, she and her daughters; and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
- Webster's Bible (WBS)
- And thy elder sister [is] Samaria, she and her daughters that dwell at thy left hand: and thy younger sister, that dwelleth at thy right hand, [is] Sodom and her daughters.
- Young's Literal Translation (YLT)
- And thine elder sister [is] Samaria, she and her daughters, Who is dwelling at thy left hand, And thy younger sister, who is dwelling on thy right hand, [is] Sodom and her daughters.
Read in context
- 44సామెతలు చెప్పువారందరును తల్లి యెట్టిదో బిడ్డయు అట్టిదేయని నిన్నుగూర్చి యందురు.
- 45పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటి దానవు, పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటి దానవు; నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు,
- 46నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.
- 47అయితే వారి ప్రవర్తన ననుసరించుటయు, వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని యెంచి, వారి నడతలను మించునట్లుగా నీవు చెడుమార్గములయందు ప్రవర్తించితివి.
- 48నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Cross references
- Ezekiel 23:4 యెహెజ్కేలు 23:4వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.
- Ezekiel 16:48–49 యెహెజ్కేలు 16:48–49నీవును నీ కుమార్తెలును చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసినవారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.
- Ezekiel 16:51 యెహెజ్కేలు 16:51షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసినవాటి కంటె నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి; నీవు ఇన్ని హేయ క్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరచితివి.
- Jeremiah 3:8–11 యిర్మీయా 3:8–11ద్రోహినియగు ఇశ్రాయేలు వ్యభి చారముచేసిన హేతువుచేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చు చున్నది. రాళ్లతోను మొద్దులతోను వ్యభిచారము చేసెను; ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకు రాలగు ఆమె సహోదరియైన యూదా పైవేషమునకే గాని తన పూర్ణహృదయముతో నాయొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యూదాకంటె ద్రోహినియగు ఇశ్రాయేలు తాను నిర్దోషినియని ఋజువుపరచుకొని యున్నది.
- Ezekiel 16:53–56 యెహెజ్కేలు 16:53–56నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చు నట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారివలెనే అపాయమొందిన నీ వారిని మరల స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, షోమ్రోనును దాని కుమార్తెలును తమ పూర్వస్థితికి వచ్చెదరు, నీవును నీ కుమార్తెలును మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టు ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలును సిరియా కుమార్తెలును నిన్ను అవమానపరచగా
- Ezekiel 16:61 యెహెజ్కేలు 16:61నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండి నను నేను వారిని నీకు కుమార్తె లుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.
- Genesis 13:10–13 ఆదికాండము 13:10–13లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను. సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.
- Deuteronomy 29:23 ద్వితీయోపదేశకాండము 29:23వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి
- Luke 17:28–30 లూకా 17:28–30లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
- Genesis 14:8 ఆదికాండము 14:8అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో,
- Ezekiel 16:27 యెహెజ్కేలు 16:27కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించు చున్నాను.
- Genesis 18:20–33 ఆదికాండము 18:20–33మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెను దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
Original words (Hebrew)
- elder · H1419גָּדוֹל gâdôwl
- sister · H269אָחוֹת ʼâchôwth
- Samaria · H8111שֹׁמְרוֹן Shômᵉrôwn
- daughters · H1323בַּת bath
- dwell · H3427יָשַׁב yâshab
- hand · H8040שְׂמֹאול sᵉmôʼwl
- younger · H6996קָטָן qâṭân
- sister · H269אָחוֹת ʼâchôwth
- dwelleth · H3427יָשַׁב yâshab
- hand · H3225יָמִין yâmîyn
- Sodom · H5467סְדֹם Çᵉdôm
- daughters · H1323בַּת bath