Ezekiel · chapter 16 · verse 5
Ezekiel 16:5 in Telugu
ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.
Ee panulalo okatainanu neeku cheyavalenani yevarunu kataakshimpaledu, neeyandu jaalipadinavaadokadunu leka poyenu; neevu puttinanaade bayatanelanu paaraveyabadi, chooda asahyamugaa untivi.
Ezekiel 16:5 in English
- King James Version (KJV)
- None eye pitied thee, to do any of these unto thee, to have compassion upon thee; but thou wast cast out in the open field, to the lothing of thy person, in the day that thou wast born.
- World English Bible (WEB)
- No eye pitied you, to do any of these things to you, to have compassion on you; but you were cast out in the open field, because you were abhorred in the day that you were born.
- American Standard Version (ASV)
- No eye pitied thee, to do any of these things unto thee, to have compassion upon thee; but thou wast cast out in the open field, for that thy person was abhorred, in the day that thou wast born.
- Bible in Basic English (BBE)
- No eye had pity on you to do any of these things to you or to be kind to you; but you were put out into the open country, because your life was hated at the time of your birth.
- Darby Translation (DBY)
- No eye pitied thee, to do any of these unto thee, to have compassion upon thee; but thou wast cast out in the open field, from abhorrence of thy person, in the day that thou wast born.
- Webster's Bible (WBS)
- No eye pitied thee, to do any of these to thee, to have compassion upon thee; but thou wast cast out in the open field, to the lothing of thy person, in the day that thou wast born.
- Young's Literal Translation (YLT)
- No eye hath had pity on thee, to do to thee any of these, To have compassion on thee, And thou art cast on the face of the field, With loathing of thy person. In the day thou hast been born — thou!
Read in context
- 3ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశసంబంధమైనవి; నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
- 4నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి.
- 5ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.
- 6అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.
- 7మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను.
Cross references
- Deuteronomy 32:10 ద్వితీయోపదేశకాండము 32:10అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
- Lamentations 4:3 విలాపవాక్యములు 4:3నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్ట్రపక్షులవలె క్రూరురాలాయెను.
- Exodus 1:22 నిర్గమకాండము 1:22అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
- Genesis 21:10 ఆదికాండము 21:10ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
- Numbers 19:16 సంఖ్యాకాండము 19:16బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.
- Isaiah 49:15 యెషయా 49:15స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
- Ezekiel 2:6 యెహెజ్కేలు 2:6నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు;
- Lamentations 2:11 విలాపవాక్యములు 2:11నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.
- Jeremiah 22:19 యిర్మీయా 22:19అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.
- Jeremiah 9:21–22 యిర్మీయా 9:21–22వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదేనీవీమాట చెప్పుముచేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చ కుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.
- Lamentations 4:10 విలాపవాక్యములు 4:10వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి.
- Lamentations 2:19 విలాపవాక్యములు 2:19నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు