Ezekiel · chapter 17 · verse 13
Ezekiel 17:13 in Telugu
మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
Mariyu atadu raajasantatilo okani nerparachi, aa raajyamu ksheeninchi tirugubaatu cheyaleka yundu natlunu, taanu cheyinchina nibandhananu aa raaju gaikonuta valana adi nilichiyundunatlunu,
Ezekiel 17:13 in English
- King James Version (KJV)
- And hath taken of the king’s seed, and made a covenant with him, and hath taken an oath of him: he hath also taken the mighty of the land:
- World English Bible (WEB)
- He took one of the royal offspring, and made a covenant with him. He also brought him under an oath, and took away the mighty of the land,
- American Standard Version (ASV)
- And he took of the seed royal, and made a covenant with him; he also brought him under an oath, and took away the mighty of the land;
- Bible in Basic English (BBE)
- And he took one of the sons of the king and made an agreement with him; and he put him under an oath, and took away the great men of the land:
- Darby Translation (DBY)
- And he took of the king's seed, and made a covenant with him, and brought him under an oath, and he took away the mighty of the land;
- Webster's Bible (WBS)
- And hath taken of the king's seed, and made a covenant with him, and hath taken an oath from him: he hath also taken the mighty of the land:
- Young's Literal Translation (YLT)
- And he taketh of the seed of the kingdom, And maketh with him a covenant, And bringeth him in to an oath, And the mighty of the land he hath taken,
Read in context
- 11మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 12తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
- 13మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండు నట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును,
- 14అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను.
- 15అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు
Cross references
- 2 Chronicles 36:13 2 దినవృత్తాంతములు 36:13మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.
- 2 Kings 24:15–17 2 రాజులు 24:15–17అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను. ఏడు వేలమంది పరాక్రమ శాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధ మందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను. మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
- Ezekiel 17:5 యెహెజ్కేలు 17:5మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.
- Jeremiah 24:1 యిర్మీయా 24:1బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.
- Jeremiah 37:1 యిర్మీయా 37:1బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.
- Jeremiah 29:2 యిర్మీయా 29:2యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,
- Jeremiah 5:2 యిర్మీయా 5:2యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.