Ezekiel · chapter 20 · verse 16
Ezekiel 20:16 in Telugu
ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.
Ichchedanani nenu selavichchi nattiyu, paalu tenelu pravahinchunattiyunaina sakala deshamulaku aabharanamagu deshamuloniki vaarini rappimpanani vaaru aranyamulo undagaane nenu pramaanamu chesitini.
Ezekiel 20:16 in English
- King James Version (KJV)
- Because they despised my judgments, and walked not in my statutes, but polluted my sabbaths: for their heart went after their idols.
- World English Bible (WEB)
- because they rejected my ordinances, and didn’t walk in my statutes, and profaned my Sabbaths; for their heart went after their idols.
- American Standard Version (ASV)
- because they rejected mine ordinances, and walked not in my statutes, and profaned my sabbaths: for their heart went after their idols.
- Bible in Basic English (BBE)
- Because they were turned away from my orders, and were not guided by my rules, and had no respect for my Sabbaths: for their hearts went after their images.
- Darby Translation (DBY)
- because they rejected mine ordinances and walked not in my statutes, and profaned my sabbaths: for their heart went after their idols.
- Webster's Bible (WBS)
- Because they despised my judgments, and walked not in my statutes, but profaned my sabbaths: for their heart went after their idols.
- Young's Literal Translation (YLT)
- Because against My judgments they did kick, And in My statutes they have not walked, And My sabbaths they have polluted, For after their idols their heart is going.
Read in context
- 14అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.
- 15మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా
- 16ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.
- 17అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.
- 18వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితినిమీరు మీ తండ్రుల ఆచారము లను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింప కయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.
Cross references
- Numbers 15:39 సంఖ్యాకాండము 15:39మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక,
- Ezekiel 20:8 యెహెజ్కేలు 20:8అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.
- Ezekiel 14:3–4 యెహెజ్కేలు 14:3–4నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరు
- Ezekiel 23:8 యెహెజ్కేలు 23:8మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
- Exodus 32:1–8 నిర్గమకాండము 32:1–8మాషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.
- Amos 5:25–26 ఆమోసు 5:25–26ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.
- Ezekiel 20:13–14 యెహెజ్కేలు 20:13–14అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.
- Numbers 25:2 సంఖ్యాకాండము 25:2ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.
- Acts 7:39–43 అపొస్తలుల కార్యములు 7:39–43ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.