Ezekiel · chapter 21 · verse 6
Ezekiel 21:6 in Telugu
కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.
Kaavuna naraputrudaa, nittoorpu viduvumu, vaaru choochuchundagaa nee nadumu baddalagunatlu manoduhkhamuto nittoorpu viduvumu.
Ezekiel 21:6 in English
- King James Version (KJV)
- Sigh therefore, thou son of man, with the breaking of [thy] loins; and with bitterness sigh before their eyes.
- World English Bible (WEB)
- “Therefore sigh, you son of man. You shall sigh before their eyes with a broken heart and with bitterness.
- American Standard Version (ASV)
- Sigh therefore, thou son of man; with the breaking of thy loins and with bitterness shalt thou sigh before their eyes.
- Bible in Basic English (BBE)
- Make sounds of grief, son of man; with body bent and a bitter heart make sounds of grief before their eyes.
- Darby Translation (DBY)
- Sigh then, thou son of man; with breaking of the loins, and with bitterness sigh before their eyes.
- Webster's Bible (WBS)
- Sigh therefore, thou son of man, with the breaking of [thy] loins; and with bitterness sigh before their eyes.
- Young's Literal Translation (YLT)
- And thou, son of man, sigh with breaking of loins, yea, with bitterness thou dost sigh before their eyes,
Read in context
- 4నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది.
- 5యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు.
- 6కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.
- 7నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవుశ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బల హీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.
- 8మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Cross references
- Ezekiel 6:11 యెహెజ్కేలు 6:11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.
- Isaiah 22:4 యెషయా 22:4నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
- Daniel 8:27 దానియేలు 8:27ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధి గ్రస్తుడనైయుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచువచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుప గలవాడెవడును లేక పోయెను.
- Ezekiel 21:12 యెహెజ్కేలు 21:12నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
- Nahum 2:10 నహూము 2:10అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
- Isaiah 16:11 యెషయా 16:11మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది కీర్హరెశు నిమిత్తము నా ఆంత్రములు సితారావలె వాగుచున్నవి.
- Jeremiah 4:19 యిర్మీయా 4:19నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?
- Habakkuk 3:16 హబక్కూకు 3:16నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి యున్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకు చున్నవి.
- Isaiah 21:3 యెషయా 21:3కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.
- Ezekiel 37:20 యెహెజ్కేలు 37:20ఇట్లుండగా వారి కీలాగు చెప్పుము
- Ezekiel 12:3–5 యెహెజ్కేలు 12:3–5నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని, పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై, నీవున్న స్థలమును విడిచి వారు చూచు చుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగు బాటు చేయువారు, అయినను దీని చూచి విచారించు కొందురేమో దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము
- John 11:33–35 యోహాను 11:33–35ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.