Ezekiel · chapter 21 · verse 12
Ezekiel 21:12 in Telugu
నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
Naraputrudaa angalaarchumu, kekaluveyumu, adi naa janulameedikini ishraayeleeyula pradhaanulameedikini vachchuchunnadi, khadgabhayamu naa janulaku tatasthinchinadi ganuka nee todanu charachukonumu.
Ezekiel 21:12 in English
- King James Version (KJV)
- Cry and howl, son of man: for it shall be upon my people, it [shall be] upon all the princes of Israel: terrors by reason of the sword shall be upon my people: smite therefore upon [thy] thigh.
- World English Bible (WEB)
- Cry and wail, son of man; for it is on my people. It is on all the princes of Israel. They are delivered over to the sword with my people. Therefore beat your thigh.
- American Standard Version (ASV)
- Cry and wail, son of man; for it is upon my people, it is upon all the princes of Israel: they are delivered over to the sword with my people; smite therefore upon thy thigh.
- Bible in Basic English (BBE)
- Give loud cries and make sounds of grief, O son of man: for it has come on my people, it has come on all the rulers of Israel: fear of the sword has come on my people: for this cause give signs of grief.
- Darby Translation (DBY)
- Cry and howl, son of man; for it shall be against my people, it shall be against all the princes of Israel: they are given up to the sword along with my people: smite therefore upon the thigh.
- Webster's Bible (WBS)
- Cry and howl, son of man: for it shall be upon my people, it [shall be] upon all the princes of Israel: terrors by reason of the sword shall be upon my people: smite therefore upon [thy] thigh.
- Young's Literal Translation (YLT)
- Cry and howl, son of man, For it hath been among My people, It [is] among all the princes of Israel, Cast unto the sword have been My people. Therefore strike on thy thigh,
Read in context
- 10అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?
- 11మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.
- 12నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.
- 13శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.
- 14నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
Cross references
- Ezekiel 21:6 యెహెజ్కేలు 21:6కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.
- Joel 1:13 యోవేలు 1:13యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.
- Ezekiel 9:8 యెహెజ్కేలు 9:8నేను తప్ప మరి ఎవరును శేషింప కుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱ పెట్టగా
- Ezekiel 21:14 యెహెజ్కేలు 21:14నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
- Jeremiah 31:19 యిర్మీయా 31:19నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడచరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.
- Jeremiah 25:34 యిర్మీయా 25:34మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.
- Ezekiel 30:2 యెహెజ్కేలు 30:2నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమ దినము వచ్చెనే,
- Ezekiel 6:11 యెహెజ్కేలు 6:11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.
- Micah 1:8 మీకా 1:8దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.
- Jeremiah 31:12 యిర్మీయా 31:12వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
Original words (Hebrew)
- Cry · H2199זָעַק zâʻaq
- howl · H3213יָלַל yâlal
- son · H1121בֵּן bên
- man · H120אָדָם ʼâdâm
- people · H5971עַם ʻam
- princes · H5387נָשִׂיא nâsîyʼ
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- terrors · H4048מָגַר mâgar
- of · H413אֵל ʼêl
- sword · H2719חֶרֶב chereb
- people · H5971עַם ʻam
- smite · H5606סָפַק çâphaq
- thigh · H3409יָרֵךְ yârêk