Ezekiel · chapter 23 · verse 28
Ezekiel 23:28 in Telugu
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.
Prabhuvaina yehovaa selavichchunademanagaa neevu dveshinchinavaarikini nee manassu edamaina vaarikini ninnu appaginchuchunnaanu.
Ezekiel 23:28 in English
- King James Version (KJV)
- For thus saith the Lord GOD; Behold, I will deliver thee into the hand [of them] whom thou hatest, into the hand [of them] from whom thy mind is alienated:
- World English Bible (WEB)
- “For the Lord GOD says: ‘Behold, I will deliver you into the hand of them whom you hate, into the hand of them from whom your soul is alienated.
- American Standard Version (ASV)
- For thus saith the Lord Jehovah: Behold, I will deliver thee into the hand of them whom thou hatest, into the hand of them from whom thy soul is alienated;
- Bible in Basic English (BBE)
- For this is what the Lord has said: See, I will give you up into the hands of those who are hated by you, into the hands of those from whom your soul is turned away in disgust:
- Darby Translation (DBY)
- For thus saith the Lord Jehovah: Behold, I will give thee over into the hand of them whom thou hatest, into the hand of them from whom thy soul is alienated.
- Webster's Bible (WBS)
- For thus saith the Lord GOD; Behold, I will deliver thee into the hand [of them] whom thou hatest, into the hand [of them] from whom thy mind is alienated:
- Young's Literal Translation (YLT)
- For thus said the Lord Jehovah: Lo, I am giving thee into a hand that thou hast hated, Into a hand from which thou wast alienated.
Read in context
- 26నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.
- 27ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.
- 28ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.
- 29ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.
- 30నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.
Cross references
- Jeremiah 34:20 యిర్మీయా 34:20వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచువారి చేతికిని వారి నప్పగించుచున్నాను, వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును.
- Ezekiel 23:17 యెహెజ్కేలు 23:17బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్ర పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.
- Ezekiel 23:22 యెహెజ్కేలు 23:22కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.
- Ezekiel 16:37 యెహెజ్కేలు 16:37నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరిని నీకిష్టులైన వారినందరిని నీవు ద్వేషించు వారినందరిని నేను పోగుచేయుచున్నాను; వారిని నీ చుట్టు పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను.
- Jeremiah 21:7–10 యిర్మీయా 21:7–10అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును. ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 24:8 యిర్మీయా 24:8మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.