Ezekiel · chapter 23 · verse 35
Ezekiel 23:35 in Telugu
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.
Prabhuvaina yehovaa ee maata selavichchu chunnaadu neevu nannu marachi venukaku trosivesitivi ganuka nee dushkaaryamulakunu vyabhichaaramunakunu raavalasina shikshanu neevu bharinchedavu.
Ezekiel 23:35 in English
- King James Version (KJV)
- Therefore thus saith the Lord GOD; Because thou hast forgotten me, and cast me behind thy back, therefore bear thou also thy lewdness and thy whoredoms.
- World English Bible (WEB)
- “Therefore the Lord GOD says: ‘Because you have forgotten me and cast me behind your back, therefore you also bear your lewdness and your prostitution.’”
- American Standard Version (ASV)
- Therefore thus saith the Lord Jehovah: Because thou hast forgotten me, and cast me behind thy back, therefore bear thou also thy lewdness and thy whoredoms.
- Bible in Basic English (BBE)
- So this is what the Lord has said: Because you have not kept me in your memory, and because your back has been turned to me, you will even undergo the punishment of your evil designs and your loose ways.
- Darby Translation (DBY)
- Therefore thus saith the Lord Jehovah: Because thou hast forgotten me, and cast me behind thy back, therefore bear thou also thy lewdness and thy fornications.
- Webster's Bible (WBS)
- Therefore thus saith the Lord GOD; Because thou hast forgotten me, and cast me behind thy back, therefore bear thou also thy lewdness and thy prostitutions.
- Young's Literal Translation (YLT)
- Therefore, thus said the Lord Jehovah: Because thou hast forgotten Me, And thou dost cast Me behind thy back, Even thou also bear thy wickedness and thy whoredoms.'
Read in context
- 33నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.
- 34అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- 35ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.
- 36మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.
- 37వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.
Cross references
- 1 Kings 14:9 1 రాజులు 14:9నీ కంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసి యున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి యున్నావు.
- Isaiah 17:10 యెషయా 17:10ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి
- Ezekiel 22:12 యెహెజ్కేలు 22:12నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Jeremiah 3:21 యిర్మీయా 3:21ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.
- Jeremiah 32:33 యిర్మీయా 32:33నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపక పోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.
- Jeremiah 2:32 యిర్మీయా 2:32కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
- Hosea 13:6 హోషేయ 13:6తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
- Hosea 8:14 హోషేయ 8:14ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.
- Numbers 14:34 సంఖ్యాకాండము 14:34మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.
- Jeremiah 23:27 యిర్మీయా 23:27బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
- Nehemiah 9:26 నెహెమ్యా 9:26అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.