Ezekiel · chapter 29 · verse 7
Ezekiel 29:7 in Telugu
వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.
Vaaru ninnu cheta pattukoninappudu neevu virigipoyi vaari prakkalalo guchchukontivi, vaaru neemeeda aanukonagaa neevu virigipoyi vaari nadumulu virigipovutaku kaaranamaitivi.
Ezekiel 29:7 in English
- King James Version (KJV)
- When they took hold of thee by thy hand, thou didst break, and rend all their shoulder: and when they leaned upon thee, thou brakest, and madest all their loins to be at a stand.
- World English Bible (WEB)
- When they took hold of you by your hand, you broke and tore all their shoulders. When they leaned on you, you broke and paralyzed all of their thighs.”
- American Standard Version (ASV)
- When they took hold of thee by thy hand, thou didst break, and didst rend all their shoulders; and when they leaned upon thee, thou brakest, and madest all their loins to be at a stand.
- Bible in Basic English (BBE)
- When they took a grip of you in their hands, you were crushed so that their arms were broken: and when they put their weight on you for support, you were broken and all their muscles gave way.
- Darby Translation (DBY)
- When they took hold of thee by thy hand, thou didst give way and rend all their shoulder; and when they leaned upon thee, thou didst break, and didst make all their loins to tremble.
- Webster's Bible (WBS)
- When they took hold of thee by thy hand, thou didst break, and rend all their shoulder: and when they leaned upon thee, thou didst break, and make all their loins to be at a stand.
- Young's Literal Translation (YLT)
- In their taking hold of thee by thy hand, — thou art crushed, And hast rent to them all the shoulder, And in their leaning on thee thou art broken, And hast caused all their thighs to stand.
Read in context
- 5నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
- 6అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను;
- 7వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.
- 8కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను,
- 9ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొను చున్నాడు గనుక
Cross references
- Isaiah 36:6 యెషయా 36:6నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.
- Ezekiel 17:15–17 యెహెజ్కేలు 17:15–17అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయముచేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణముచేసి దాని నిర్లక్ష్యపెట్టెనో, యెవనితో తానుచేసిన నిబంధనను అతడు భంగముచేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవ ముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు. యుద్ధము జరుగగా అనేక జనులను నిర్మూలము చేయవలెనని కల్దీయులు దిబ్బలువేసి బురుజులు కట్టిన సమయమున, ఫరో యెంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు.
- Jeremiah 17:5–6 యిర్మీయా 17:5–6యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
- Jeremiah 37:5–11 యిర్మీయా 37:5–11ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును. కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు. మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూష లేము ఎదుటనుండి వెళ్లిపోగా
- Psalm 118:8–9 కీర్తనలు 118:8–9మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- Psalm 146:3–4 కీర్తనలు 146:3–4రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.
- Proverbs 25:19 సామెతలు 25:19శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము.