Ezekiel · chapter 3 · verse 4
Ezekiel 3:4 in Telugu
మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.
Mariyu aayana naato eelaagu selavichchenu naraputrudaa, neevu bayaluderi ishraayeleeyula yoddaku poyi naa maatalu vaariki teliyajeppumu.
Ezekiel 3:4 in English
- King James Version (KJV)
- And he said unto me, Son of man, go, get thee unto the house of Israel, and speak with my words unto them.
- World English Bible (WEB)
- He said to me, “Son of man, go to the house of Israel, and speak my words to them.
- American Standard Version (ASV)
- And he said unto me, Son of man, go, get thee unto the house of Israel, and speak with my words unto them.
- Bible in Basic English (BBE)
- And he said to me, Son of man, go now to the children of Israel, and say my words to them.
- Darby Translation (DBY)
- And he said unto me, Son of man, go, get thee unto the house of Israel, and speak with my words unto them.
- Webster's Bible (WBS)
- And he said to me, Son of man, depart, go to the house of Israel, and speak with my words to them.
- Young's Literal Translation (YLT)
- And He saith unto me, 'Son of man, go, enter in unto the house of Israel, and thou hast spoken with My words unto them.
Read in context
- 2నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి
- 3నరపుత్రుడా, నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా నుండెను.
- 4మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.
- 5నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు జనులయొద్దకు కాదు ఇశ్రాయేలీయులయొద్దకే నిన్ను పంపుచున్నాను.
- 6నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనులయొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు.
Cross references
- Acts 1:8 అపొస్తలుల కార్యములు 1:8అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను
- Matthew 15:24 మత్తయి 15:24ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను
- Ezekiel 3:11 యెహెజ్కేలు 3:11బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.
- Ezekiel 2:3 యెహెజ్కేలు 2:3ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు.
- Matthew 10:5–6 మత్తయి 10:5–6యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
- Ezekiel 2:7 యెహెజ్కేలు 2:7అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.