Ezekiel · chapter 35 · verse 4
Ezekiel 35:4 in Telugu
నీవు నిర్జనముగా ఉండు నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.
Neevu nirjanamugaa undu natlu nee pattanamulanu edaarulugaa chesedanu, neevu paadavuduvu, appudu nenu yehovaanai yunnaanani neevu telisikonduvu.
Ezekiel 35:4 in English
- King James Version (KJV)
- I will lay thy cities waste, and thou shalt be desolate, and thou shalt know that I [am] the LORD.
- World English Bible (WEB)
- I will lay your cities waste, and you will be desolate. Then you will know that I am the LORD.
- American Standard Version (ASV)
- I will lay thy cities waste, and thou shalt be desolate; and thou shalt know that I am Jehovah.
- Bible in Basic English (BBE)
- I will make your towns unpeopled and you will be a waste; and you will be certain that I am the Lord.
- Darby Translation (DBY)
- I will lay thy cities waste, and thou shalt be a desolation: and thou shalt know that I [am] Jehovah.
- Webster's Bible (WBS)
- I will lay thy cities waste, and thou shalt be desolate, and thou shalt know that I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- Thy cities a waste I make, and thou art a desolation, And thou hast known that I [am] Jehovah.
Read in context
- 2నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని
- 3దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడు గాను నిర్జనముగాను చేసెదను.
- 4నీవు నిర్జనముగా ఉండు నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.
- 5ఇశ్రాయేలీయుల యెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక
- 6నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసె దను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Cross references
- Ezekiel 35:9 యెహెజ్కేలు 35:9నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.
- Malachi 1:3–4 మలాకీ 1:3–4ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.
- Exodus 14:4 నిర్గమకాండము 14:4అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
- Exodus 9:14 నిర్గమకాండము 9:14సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్ళన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;
- Ezekiel 6:6–7 యెహెజ్కేలు 6:6–7నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును, మీ జనులు హతులై కూలుదురు.
- Joel 3:19 యోవేలు 3:19ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.
- Ezekiel 35:12 యెహెజ్కేలు 35:12అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు.