Ezekiel · chapter 35 · verse 9
Ezekiel 35:9 in Telugu
నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.
Nenu yehovaanai yunnaanani meeru telisikonunatlu nee pattanamulu marala kattabadakunda ellappudunu paadugaa undajeyudunu.
Ezekiel 35:9 in English
- King James Version (KJV)
- I will make thee perpetual desolations, and thy cities shall not return: and ye shall know that I [am] the LORD.
- World English Bible (WEB)
- I will make you a perpetual desolation, and your cities will not be inhabited. Then you will know that I am the LORD.
- American Standard Version (ASV)
- I will make thee a perpetual desolation, and thy cities shall not be inhabited; and ye shall know that I am Jehovah.
- Bible in Basic English (BBE)
- I will make you waste for ever, and your towns will be unpeopled: and you will be certain that I am the Lord.
- Darby Translation (DBY)
- I will make thee perpetual desolations, and thy cities shall not be inhabited: and ye shall know that I [am] Jehovah.
- Webster's Bible (WBS)
- I will make thee perpetual desolations, and thy cities shall not return: and ye shall know that I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- Desolations age-during I make thee, And thy cities do not return, And ye have known that I [am] Jehovah.
Read in context
- 7వచ్చువారును పోవువారును లేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును.
- 8అతని పర్వతములను హత మైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయల లోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు.
- 9నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.
- 10యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశ ములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;
- 11నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.
Cross references
- Ezekiel 25:13 యెహెజ్కేలు 25:13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
- Ezekiel 35:4 యెహెజ్కేలు 35:4నీవు నిర్జనముగా ఉండు నట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు.
- Malachi 1:3–4 మలాకీ 1:3–4ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.
- Ezekiel 6:7 యెహెజ్కేలు 6:7మీ జనులు హతులై కూలుదురు.
- Ezekiel 36:11 యెహెజ్కేలు 36:11మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
- Ezekiel 7:9 యెహెజ్కేలు 7:9యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును.
- Jeremiah 49:17–18 యిర్మీయా 49:17–18ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు. సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
- Zephaniah 2:9 జెఫన్యా 2:9నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్య ములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.
- Jeremiah 49:13 యిర్మీయా 49:13బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Ezekiel 7:4 యెహెజ్కేలు 7:4నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును.