Ezekiel · chapter 39 · verse 8
Ezekiel 39:8 in Telugu
ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Idigo adi vachchuchunnadi, kalugabovuchunnadi, nenu teliyajesina samayamuna adi jarugunu; ide prabhuvagu yehovaa vaakku.
Ezekiel 39:8 in English
- King James Version (KJV)
- Behold, it is come, and it is done, saith the Lord GOD; this [is] the day whereof I have spoken.
- World English Bible (WEB)
- Behold, it comes, and it will be done,” says the Lord GOD. “This is the day about which I have spoken.
- American Standard Version (ASV)
- Behold, it cometh, and it shall be done, saith the Lord Jehovah; this is the day whereof I have spoken.
- Bible in Basic English (BBE)
- See, it is coming and it will be done, says the Lord; this is the day of which I have given word.
- Darby Translation (DBY)
- Behold, it cometh, and shall be done, saith the Lord Jehovah. This is the day whereof I have spoken.
- Webster's Bible (WBS)
- Behold, it is come, and it is done, saith the Lord GOD; this [is] the day of which I have spoken.
- Young's Literal Translation (YLT)
- Lo, it hath come, and it hath been done, An affirmation of the Lord Jehovah, It [is] the day of which I spake.
Read in context
- 6నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్వి చారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.
- 7నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను.
- 8ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 9ఇశ్రా యేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.
- 10వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్ల పెట్టినవారి సొమ్ము తామే కొల్ల పెట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Cross references
- Ezekiel 38:17 యెహెజ్కేలు 38:17ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వ మందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చి నదే గదా?
- Ezekiel 7:2–10 యెహెజ్కేలు 7:2–10నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను. నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును. ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను.
- Revelation 16:17 ప్రకటన 16:17ఏడవ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్నయొక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.
- Isaiah 33:10–12 యెషయా 33:10–12యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది. జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.
- 2 Peter 3:8 2 పేతురు 3:8ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
- Revelation 21:6 ప్రకటన 21:6మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.