Ezekiel · chapter 7 · verse 2
Ezekiel 7:2 in Telugu
నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది.
Naraputrudaa, prakatimpumu; ishraayeleeyula deshamunaku antamu vachchiyunnadi, naludikkula deshamunaku antamu vachcheyunnadani prabhuvagu yehovaa selavichchuchunnaadu; ippudu neeku antamu vachcheyunnadi.
Ezekiel 7:2 in English
- King James Version (KJV)
- Also, thou son of man, thus saith the Lord GOD unto the land of Israel; An end, the end is come upon the four corners of the land.
- World English Bible (WEB)
- “You, son of man, the Lord GOD says to the land of Israel, ‘An end! The end has come on the four corners of the land.
- American Standard Version (ASV)
- And thou, son of man, thus saith the Lord Jehovah unto the land of Israel, An end: the end is come upon the four corners of the land.
- Bible in Basic English (BBE)
- And you, son of man, say, This is what the Lord has said to the land of Israel: An end has come, the end has come on the four quarters of the land.
- Darby Translation (DBY)
- And thou, son of man, thus saith the Lord Jehovah unto the land of Israel: An end, the end is come upon the four corners of the land.
- Webster's Bible (WBS)
- Also, thou son of man, thus saith the Lord GOD to the land of Israel; An end, the end is come upon the four corners of the land.
- Young's Literal Translation (YLT)
- An end, come hath the end on the four corners of the land.
Read in context
- 1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది.
- 3నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.
- 4నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును.
Cross references
- Amos 8:2 ఆమోసు 8:2ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.
- 1 Peter 4:7 1 పేతురు 4:7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
- Ezekiel 7:3 యెహెజ్కేలు 7:3నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.
- Amos 8:10 ఆమోసు 8:10మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Ezekiel 7:5–6 యెహెజ్కేలు 7:5–6ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను.
- Lamentations 4:18 విలాపవాక్యములు 4:18రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది.
- Ezekiel 11:13 యెహెజ్కేలు 11:13నేను ఆ ప్రకారము ప్రవచింపు చుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి యెలుగెత్తి–అయ్యో, ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీయుల శేషమును నీవు నిర్మూలము చేయుదువా? అని మొఱ్ఱపెట్టితిని.
- Matthew 24:6 మత్తయి 24:6మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
- 2 Chronicles 34:7 2 దినవృత్తాంతములు 34:7బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
- Lamentations 1:9 విలాపవాక్యములు 1:9దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.
- Jeremiah 51:13 యిర్మీయా 51:13విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
- Ezekiel 21:2 యెహెజ్కేలు 21:2నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము