Ezekiel · chapter 44 · verse 16
Ezekiel 44:16 in Telugu
వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Vaare naa parishuddhasthalamulo praveshinturu, paricharya cheyutakai vaare naa ballayoddaku vatturu, vaare nenappaginchina daanini kaapaaduduru; ide prabhuvagu yehovaa vaakku.
Ezekiel 44:16 in English
- King James Version (KJV)
- They shall enter into my sanctuary, and they shall come near to my table, to minister unto me, and they shall keep my charge.
- World English Bible (WEB)
- “They shall enter into my sanctuary, and they shall come near to my table, to minister to me, and they shall keep my instruction.
- American Standard Version (ASV)
- they shall enter into my sanctuary, and they shall come near to my table, to minister unto me, and they shall keep my charge.
- Bible in Basic English (BBE)
- They are to come into my holy place and they are to come near to my table, to do my work and have the care of my house.
- Darby Translation (DBY)
- They shall enter into my sanctuary, and they shall approach unto my table, to minister unto me, and they shall keep my charge.
- Webster's Bible (WBS)
- They shall enter into my sanctuary, and they shall come near to my table, to minister to me, and they shall keep my charge.
- Young's Literal Translation (YLT)
- they come in unto My sanctuary, and they draw near unto My table to serve Me, and they have kept My charge.
Read in context
- 14అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను.
- 15ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 16వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- 17వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనారబట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మములద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్ల బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు.
- 18అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుప నారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.
Cross references
- Ezekiel 41:22 యెహెజ్కేలు 41:22బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడి నవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.
- Malachi 1:7 మలాకీ 1:7నా బలి పీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా
- Malachi 1:12 మలాకీ 1:12అయితేయెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు
- Numbers 18:7–8 సంఖ్యాకాండము 18:7–8కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.
- Deuteronomy 33:8–10 ద్వితీయోపదేశకాండము 33:8–10లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు
- Numbers 18:5 సంఖ్యాకాండము 18:5అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.
- Revelation 1:6 ప్రకటన 1:6మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.