Ezekiel · chapter 48 · verse 29
Ezekiel 48:29 in Telugu
మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రము లకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
Meeru cheetluvesi ishraayeleeyula gotramu laku vibhaagimpavalasina deshamu ide. Vaarivaari bhaagamulu ive. Yide yehovaa yichchina aajnya.
Ezekiel 48:29 in English
- King James Version (KJV)
- This [is] the land which ye shall divide by lot unto the tribes of Israel for inheritance, and these [are] their portions, saith the Lord GOD.
- World English Bible (WEB)
- “This is the land which you shall divide by lot to the tribes of Israel for inheritance, and these are their several portions, says the Lord GOD.
- American Standard Version (ASV)
- This is the land which ye shall divide by lot unto the tribes of Israel for inheritance, and these are their several portions, saith the Lord Jehovah.
- Bible in Basic English (BBE)
- This is the land of which distribution is to be made by the decision of the Lord, among the tribes of Israel for their heritage, and these are their heritages, says the Lord.
- Darby Translation (DBY)
- This is the land which ye shall divide by lot unto the tribes of Israel for inheritance, and these are their portions, saith the Lord Jehovah.
- Webster's Bible (WBS)
- This [is] the land which ye shall divide by lot to the tribes of Israel for inheritance, and these [are] their portions, saith the Lord GOD.
- Young's Literal Translation (YLT)
- This [is] the land that ye separate by inheritance to the tribes of Israel, and these [are] their portions — an affirmation of the Lord Jehovah.
Read in context
- 27జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒకభాగము;
- 28దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.
- 29మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రము లకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
- 30పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.
- 31ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.
Cross references
- Numbers 34:2 సంఖ్యాకాండము 34:2కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున
- Joshua 13:1–21 యెహోషువ 13:1–21యెహోషువ బహుదినములు గడచిన వృద్ధుడుకాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెనునీవు బహు దినములు గడచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీ యుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీ యుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును దక్షిణదిక్కున ఆవీయుల దేశమును కనానీయుల దేశ మంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దువరకును గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివా సుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞా పించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును గిలాదును, గెషూరీ యులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు రెఫాయీయుల శేషములో అష్తారోతు లోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశము నైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించు చున్నారు. లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్య లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను యాహసు కెదేమోతు మేఫాతు కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను.
- Numbers 34:13 సంఖ్యాకాండము 34:13మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమ్మిది గోత్ర ములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞా పించెను;
- Ezekiel 47:13–22 యెహెజ్కేలు 47:13–22ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సరి హద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను. నేను ప్రమాణముచేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహా సముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దు నకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువ వలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.