Genesis · chapter 13 · verse 1
Genesis 13:1 in Telugu
అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.
Abraamu tanaku kaligina samastamunu tana bhaaryanu tanato koodanunna lotunu ventabettukoni aiguptulo nundi negebunaku vellenu.
Genesis 13:1 in English
- King James Version (KJV)
- And Abram went up out of Egypt, he, and his wife, and all that he had, and Lot with him, into the south.
- World English Bible (WEB)
- Abram went up out of Egypt—he, his wife, all that he had, and Lot with him—into the South.
- American Standard Version (ASV)
- And Abram went up out of Egypt, he, and his wife, and all that he had, and Lot with him, into the South.
- Bible in Basic English (BBE)
- And Abram went up out of Egypt with his wife and all he had, and Lot with him, and they came in to the South.
- Darby Translation (DBY)
- And Abram went up out of Egypt, he, and his wife, and all that he had, and Lot with him, towards the south.
- Webster's Bible (WBS)
- And Abram returned from Egypt, he, and his wife, and all that he had, and Lot with him, into the south.
- Young's Literal Translation (YLT)
- And Abram goeth up from Egypt (he and his wife, and all that he hath, and Lot with him) towards the south;
Read in context
- 1అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.
- 2అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.
- 3అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి
Cross references
- 2 Samuel 24:7 2 సమూయేలు 24:7అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణ మునకును హివ్వీయులయొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి.
- Joshua 10:40 యెహోషువ 10:40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
- Genesis 12:9–20 ఆదికాండము 12:9–20అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను. అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను. అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.
- Genesis 20:1 ఆదికాండము 20:1అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
- Genesis 21:33 ఆదికాండము 21:33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.
- Joshua 18:5 యెహోషువ 18:5వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి యుండవలెను.
- 1 Samuel 27:10 1 సమూయేలు 27:10ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.