Genesis · chapter 13 · verse 18
Genesis 13:18 in Telugu
అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
Appudu abraamu tana gudaaramu teesi hebronu loni mamre daggaranunna sindhoora vruksha vanamulo digi akkada yehovaaku balipeethamunu kattenu.
Genesis 13:18 in English
- King James Version (KJV)
- Then Abram removed [his] tent, and came and dwelt in the plain of Mamre, which [is] in Hebron, and built there an altar unto the LORD.
- World English Bible (WEB)
- Abram moved his tent, and came and lived by the oaks of Mamre, which are in Hebron, and built an altar there to the LORD.
- American Standard Version (ASV)
- And Abram moved his tent, and came and dwelt by the oaks of Mamre, which are in Hebron, and built there an altar unto Jehovah.
- Bible in Basic English (BBE)
- And Abram, moving his tent, came and made his living-place by the holy tree of Mamre, which is in Hebron, and made an altar there to the Lord.
- Darby Translation (DBY)
- Then Abram moved [his] tents, and came and dwelt by the oaks of Mamre, which are in Hebron. And he built there an altar to Jehovah.
- Webster's Bible (WBS)
- Then Abram removed [his] tent, and came and dwelt in the plain of Mamre, which [is] in Hebron, and built there an altar to the LORD.
- Young's Literal Translation (YLT)
- And Abram tenteth, and cometh, and dwelleth among the oaks of Mamre, which [are] in Hebron, and buildeth there an altar to Jehovah.
Read in context
- 16మరియు నీ సంతానమును భూమి మీదనుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.
- 17నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.
- 18అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
Cross references
- Genesis 8:20 ఆదికాండము 8:20అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
- Genesis 18:1 ఆదికాండము 18:1మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
- Genesis 35:27 ఆదికాండము 35:27అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
- Genesis 14:13 ఆదికాండము 14:13తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.
- Genesis 12:7–8 ఆదికాండము 12:7–8యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Psalm 16:8 కీర్తనలు 16:8సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
- Genesis 13:4 ఆదికాండము 13:4తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
- Genesis 37:14 ఆదికాండము 37:14అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.
- Numbers 13:22 సంఖ్యాకాండము 13:22వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.
- 1 Timothy 2:8 1 తిమోతికి 2:8కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
- Joshua 14:13 యెహోషువ 14:13యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.
- Genesis 23:2 ఆదికాండము 23:2శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.