Genesis · chapter 46 · verse 11
Genesis 46:11 in Telugu
లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
Levi kumaarulaina gershonu kahaatu meraari
Genesis 46:11 in English
- King James Version (KJV)
- And the sons of Levi; Gershon, Kohath, and Merari.
- World English Bible (WEB)
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- American Standard Version (ASV)
- And the sons of Levi: Gershon, Kohath, and Merari.
- Bible in Basic English (BBE)
- And the sons of Levi: Gershon, Kohath, and Merari;
- Darby Translation (DBY)
- — And the sons of Levi: Gershon, Kohath, and Merari.
- Webster's Bible (WBS)
- And the sons of Levi; Gershon, Kohath, and Merari.
- Young's Literal Translation (YLT)
- And sons of Levi: Gershon, Kohath, and Merari.
Read in context
- 9యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.
- 10షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.
- 11లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
- 12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
- 13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
Cross references
- Genesis 29:34 ఆదికాండము 29:34ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
- Numbers 4:1–49 సంఖ్యాకాండము 4:1–49యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెల విచ్చెను నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్య క్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్ర లను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింప వలెను. పనిచేయు టయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ; వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడార మును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టును బలిపీఠము చుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధ మైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయ బడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాట చొప్పున జరుగ వలెను. వారు జరుపువాటి నన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడా రములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను. మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడార ములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభము లను దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి. వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది. ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది. మెరారీ యుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది. యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.
- 1 Chronicles 22:1–19 1 దినవృత్తాంతములు 22:1–19మరియుదేవుడైన యెహోవా నివాసస్థలము ఇదే యని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదేయని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రా యేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయు లును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక. యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడిన యెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక. మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను. ఎట్లనగామీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చి యున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచి యున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందస మును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి.
- Numbers 26:57–58 సంఖ్యాకాండము 26:57–58వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము.
- Numbers 3:17–22 సంఖ్యాకాండము 3:17–22లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే. వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.
- Genesis 49:5–7 ఆదికాండము 49:5–7షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి. వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
- 1 Chronicles 2:11 1 దినవృత్తాంతములు 2:11నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
- Deuteronomy 33:8–11 ద్వితీయోపదేశకాండము 33:8–11లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము.
- 1 Chronicles 2:16 1 దినవృత్తాంతములు 2:16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
- 1 Chronicles 6:1–3 1 దినవృత్తాంతములు 6:1–3లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
- 1 Chronicles 2:1 1 దినవృత్తాంతములు 2:1ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
- Numbers 8:1–26 సంఖ్యాకాండము 8:1–26యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలు కొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచు కొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయ వలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడు కొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింప వలెను. లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతు లుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి త్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయ బడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను. ఏలయనగా మనుష్యులలోను పశు వులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని. ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రా యేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయు లలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీ యుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీ యులు వారికి అట్లేచేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరు వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీ యులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనుఇది లేవీయులనుగూర్చిన విధి. ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితో కూడ పరిచర్య చేయ వలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.