Genesis · chapter 46 · verse 28
Genesis 46:28 in Telugu
అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా
Atadu goshenuku trova chooputaku yosepu noddaku tanaku mundugaa yoodaanu pampenu. Vaaru goshenu deshamunaku raagaa
Genesis 46:28 in English
- King James Version (KJV)
- And he sent Judah before him unto Joseph, to direct his face unto Goshen; and they came into the land of Goshen.
- World English Bible (WEB)
- Jacob sent Judah before him to Joseph, to show the way before him to Goshen, and they came into the land of Goshen.
- American Standard Version (ASV)
- And he sent Judah before him unto Joseph, to show the way before him unto Goshen; and they came into the land of Goshen.
- Bible in Basic English (BBE)
- Now he had sent Judah before him to Goshen, to get word from Joseph; and so they came to the land of Goshen.
- Darby Translation (DBY)
- And he sent Judah before him to Joseph, to give notice before he came to Goshen. And they came into the land of Goshen.
- Webster's Bible (WBS)
- And he sent Judah before him to Joseph, to direct his face to Goshen; and they came into the land of Goshen.
- Young's Literal Translation (YLT)
- And Judah he hath sent before him unto Joseph, to direct before him to Goshen, and they come into the land of Goshen;
Read in context
- 26యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.
- 27ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
- 28అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా
- 29యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
- 30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో - నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.
Cross references
- Genesis 45:10 ఆదికాండము 45:10నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.
- Genesis 31:21 ఆదికాండము 31:21అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
- Genesis 44:16–34 ఆదికాండము 44:16–34యూదా యిట్లనెను - ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా యూదా అతని సమీపించిఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా ఏలినవాడుమీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు. మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్ట మృగములచేత చీల్చబడెననుకొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలుగల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము. తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము. ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.
- Genesis 49:8 ఆదికాండము 49:8యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
- Genesis 43:8 ఆదికాండము 43:8యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;