Genesis · chapter 9 · verse 26
Genesis 9:26 in Telugu
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
Mariyu atadu shemu devudaina yehovaa stutimpabadunugaaka kanaanu ataniki daasudagunu.
Genesis 9:26 in English
- King James Version (KJV)
- And he said, Blessed [be] the LORD God of Shem; and Canaan shall be his servant.
- World English Bible (WEB)
- He said, “Blessed be the LORD, the God of Shem. Let Canaan be his servant.
- American Standard Version (ASV)
- And he said, Blessed be Jehovah, the God of Shem; And let Canaan be his servant.
- Bible in Basic English (BBE)
- And he said, Praise to the Lord, the God of Shem; let Canaan be his servant.
- Darby Translation (DBY)
- And he said, Blessed be Jehovah, the God of Shem, And let Canaan be his bondman.
- Webster's Bible (WBS)
- And he said, Blessed be the LORD God of Shem; and Canaan shall be his servant.
- Young's Literal Translation (YLT)
- And he saith: 'Blessed of Jehovah my God [is] Shem, And Canaan is servant to him.
Read in context
- 24అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని -
- 25కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
- 26మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
- 27దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
- 28ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.
Cross references
- Psalm 144:15 కీర్తనలు 144:15ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.
- Hebrews 11:16 హెబ్రీయులకు 11:16అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
- Genesis 12:1–3 ఆదికాండము 12:1–3యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా
- Deuteronomy 33:26 ద్వితీయోపదేశకాండము 33:26యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
- Luke 3:23–36 లూకా 3:23–36యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు, యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యా కీముకు, ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- Genesis 10:10–26 ఆదికాండము 10:10–26షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము. మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు. అరాము కుమారులు ఊజుహూలు గెతెరు మాషనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
- Romans 9:5 రోమీయులకు 9:5పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
- Genesis 27:37 ఆదికాండము 27:37అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸
- Genesis 27:40 ఆదికాండము 27:40నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.