Deuteronomy · chapter 33 · verse 26
Deuteronomy 33:26 in Telugu
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
Yeshooroonoo, devuni polinavaadevadunu ledu aayana neeku sahaayamu cheyutaku aakaashavaahanudai vachchunu mahonnatudai meghavaahanudagunu.
Deuteronomy 33:26 in English
- King James Version (KJV)
- [There is] none like unto the God of Jeshurun, [who] rideth upon the heaven in thy help, and in his excellency on the sky.
- World English Bible (WEB)
- “There is no one like God, Jeshurun, who rides on the heavens for your help, in his excellency on the skies.
- American Standard Version (ASV)
- There is none like unto God, O Jeshurun, Who rideth upon the heavens for thy help, And in his excellency on the skies.
- Bible in Basic English (BBE)
- No other is like the God of Jeshurun, coming on the heavens to your help, and letting his glory be seen in the skies.
- Darby Translation (DBY)
- There is none like unto the God of Jeshurun, Who rideth upon the heavens to thy help, And in his majesty, upon the clouds.
- Webster's Bible (WBS)
- [There is] none like to the God of Jeshurun, [who] rideth upon the heaven in thy help, and in his excellence on the sky.
- Young's Literal Translation (YLT)
- There is none like the God of Jeshurun, Riding the heavens in thy help, And in His excellency the skies.
Read in context
- 24ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
- 25నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.
- 26యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.
- 27శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.
- 28ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును.
Cross references
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Isaiah 43:11–13 యెషయా 43:11–13నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?
- Habakkuk 3:8 హబక్కూకు 3:8యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు?
- Jeremiah 10:6 యిర్మీయా 10:6యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను.
- Psalm 68:33–34 కీర్తనలు 68:33–34అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది
- Psalm 104:3 కీర్తనలు 104:3జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
- Isaiah 19:1 యెషయా 19:1ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
- Deuteronomy 32:15 ద్వితీయోపదేశకాండము 32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
- Psalm 86:8 కీర్తనలు 86:8ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.
- Psalm 18:10 కీర్తనలు 18:10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- Isaiah 40:18 యెషయా 40:18కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
- Isaiah 40:25 యెషయా 40:25నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.