Habakkuk · chapter 2 · verse 7
Habakkuk 2:7 in Telugu
వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
Vaddi kichchuvaaru hathaattugaa neemeeda paduduru, ninnu hinsa pettabovuvaaru jaagrattagaa vatturu, neevu vaariki dopudu sommugaa unduvu.
Habakkuk 2:7 in English
- King James Version (KJV)
- Shall they not rise up suddenly that shall bite thee, and awake that shall vex thee, and thou shalt be for booties unto them?
- World English Bible (WEB)
- Won’t your debtors rise up suddenly, and wake up those who make you tremble, and you will be their victim?
- American Standard Version (ASV)
- Shall they not rise up suddenly that shall bite thee, and awake that shall vex thee, and thou shalt be for booty unto them?
- Bible in Basic English (BBE)
- Will not your creditors suddenly be moved against you, and your troublers get up from their sleep, and you will be to them like goods taken in war?
- Darby Translation (DBY)
- Shall they not rise up suddenly that shall bite thee, and they awake up that shall vex thee, and thou shalt be for booties unto them?
- Webster's Bible (WBS)
- Shall they not rise suddenly that shall bite thee, and awake that shall disturb thee, and thou shalt be for booties to them?
- Young's Literal Translation (YLT)
- Do not thy usurers instantly rise up, And those shaking thee awake up, And thou hast been for a spoil to them?
Read in context
- 5మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
- 6తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
- 7వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
- 8బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.
- 9తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
Cross references
- Proverbs 29:1 సామెతలు 29:1ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
- Isaiah 41:25 యెషయా 41:25ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.
- Ecclesiastes 10:8 ప్రసంగి 10:8గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.
- Daniel 5:25–31 దానియేలు 5:25–31ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి. ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.
- Jeremiah 51:57 యిర్మీయా 51:57దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధి పతులను బలాఢ్యులను మత్తిల్లజేసెదను వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు ఇదే రాజు వాక్కు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
- Isaiah 46:11 యెషయా 46:11తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.
- Jeremiah 51:11 యిర్మీయా 51:11బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.
- Isaiah 13:16–18 యెషయా 13:16–18వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు. వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు వారి విండ్లు ¸యౌవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.
- Isaiah 45:1–3 యెషయా 45:1–3అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.
- 1 Thessalonians 5:3 1 థెస్సలొనీకయులకు 5:3లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
- Jeremiah 50:21–32 యిర్మీయా 50:21–32దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు. కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చు చున్నాడు. నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడు చున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. కావున ఆ దినమున దాని ¸యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
- Nahum 1:9–10 నహూము 1:9–10యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును. ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.