Hebrews · chapter 5 · verse 4
Hebrews 5:4 in Telugu
మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.
Mariyu evadunu ee ghanata tanakutaane vahinchukonadu gaani, aharonu piluvabadinattugaa devunicheta piluvabadinavaadai yee ghanatapondunu.
Hebrews 5:4 in English
- King James Version (KJV)
- And no man taketh this honour unto himself, but he that is called of God, as [was] Aaron.
- World English Bible (WEB)
- Nobody takes this honor on himself, but he is called by God, just like Aaron was.
- American Standard Version (ASV)
- And no man taketh the honor unto himself, but when he is called of God, even as was Aaron.
- Bible in Basic English (BBE)
- And no man who is not given authority by God, as Aaron was, takes this honour for himself.
- Darby Translation (DBY)
- And no one takes the honour to himself but [as] called by God, even as Aaron also.
- Webster's Bible (WBS)
- And no man taketh this honor to himself, but he that is called by God, as [was] Aaron:
- Young's Literal Translation (YLT)
- and no one to himself doth take the honour, but he who is called by God, as also Aaron:
Read in context
- 2తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.
- 3ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.
- 4మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.
- 5అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
- 6ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.
Cross references
- Exodus 28:1 నిర్గమకాండము 28:1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- Numbers 16:5 సంఖ్యాకాండము 16:5తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.
- Numbers 16:40 సంఖ్యాకాండము 16:40కోరహువలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకు డైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.
- 1 Chronicles 23:13 1 దినవృత్తాంతములు 23:13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- 2 Chronicles 26:18 2 దినవృత్తాంతములు 26:18వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా
- John 3:27 యోహాను 3:27అందుకు యోహాను ఇట్లనెను తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు.
- Numbers 18:7 సంఖ్యాకాండము 18:7కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.
- Numbers 16:46–48 సంఖ్యాకాండము 16:46–48అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.
- Numbers 16:35 సంఖ్యాకాండము 16:35మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
- Numbers 16:10 సంఖ్యాకాండము 16:10ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
- Numbers 18:1–5 సంఖ్యాకాండము 18:1–5యెహోవా అహరోనుతో ఇట్లనెనునీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండ వలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్య క్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను. అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.
- Numbers 17:3–11 సంఖ్యాకాండము 17:3–11లేవికఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను. నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రా యేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను. మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్ని ధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను. మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.