Hosea · chapter 5 · verse 5
Hosea 5:5 in Telugu
ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రాయిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లు చున్నారు.
Ishraayeluyokka atishayaaspadamu atanimeeda saakshyamichchunu. Ishraayeluvaarunu ephraayimuvaarunu tama doshamulo chikkupadi totrillu chunnaaru; vaaritokooda yoodaavaarunu totrillu chunnaaru.
Hosea 5:5 in English
- King James Version (KJV)
- And the pride of Israel doth testify to his face: therefore shall Israel and Ephraim fall in their iniquity; Judah also shall fall with them.
- World English Bible (WEB)
- The pride of Israel testifies to his face. Therefore Israel and Ephraim will stumble in their iniquity. Judah also will stumble with them.
- American Standard Version (ASV)
- And the pride of Israel doth testify to his face: therefore Israel and Ephraim shall stumble in their iniquity; Judah also shall stumble with them.
- Bible in Basic English (BBE)
- And the pride of Israel gives an answer to his face; and Ephraim will have a fall through his sins, and the fall of Judah will be the same as theirs.
- Darby Translation (DBY)
- And Israel's pride doth testify to his face; and Israel and Ephraim shall fall by their iniquity: Judah also shall fall with them.
- Webster's Bible (WBS)
- And the pride of Israel doth testify to his face: therefore shall Israel and Ephraim fall in their iniquity; Judah also shall fall with them.
- Young's Literal Translation (YLT)
- And humbled hath been the excellency of Israel to his face, And Israel and Ephraim stumble by their iniquity, Stumbled also hath Judah with them.
Read in context
- 3ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.
- 4తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.
- 5ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రాయిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లు చున్నారు.
- 6వారు గొఱ్ఱెలను ఎడ్లను తీసికొని యెహో వాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.
- 7యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.
Cross references
- Hosea 7:10 హోషేయ 7:10ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.
- Ezekiel 23:31–35 యెహెజ్కేలు 23:31–35ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయ వలసినది చాల యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.
- Proverbs 24:16 సామెతలు 24:16నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.
- Luke 19:22 లూకా 19:22అందుకతడు - చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
- Amos 5:2 ఆమోసు 5:2కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.
- Jeremiah 14:7 యిర్మీయా 14:7యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
- Hosea 5:14 హోషేయ 5:14ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడను గాను యూదావారికి కొదమ సింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును
- Isaiah 3:9 యెషయా 3:9వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ
- Hosea 14:1 హోషేయ 14:1ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
- Proverbs 11:5 సామెతలు 11:5యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
- Isaiah 28:1–3 యెషయా 28:1–3త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణ మునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు. త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.
- Isaiah 59:12 యెషయా 59:12మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.