Jeremiah · chapter 14 · verse 7
Jeremiah 14:7 in Telugu
యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
Yehovaa, maa tirugubaatulu anekamulu, neeku virodhamugaa memu paapamuchesitiviు; maa doshamulu maa meeda doshaaropana cheyuchunnavi; nee naamamunu batti neeve kaaryamu jariginchumu.
Jeremiah 14:7 in English
- King James Version (KJV)
- O LORD, though our iniquities testify against us, do thou [it] for thy name’s sake: for our backslidings are many; we have sinned against thee.
- World English Bible (WEB)
- Though our iniquities testify against us, work for your name’s sake, LORD; for our rebellions are many. We have sinned against you.
- American Standard Version (ASV)
- Though our iniquities testify against us, work thou for thy name’s sake, O Jehovah; for our backslidings are many; we have sinned against thee.
- Bible in Basic English (BBE)
- Though our sins give witness against us, do something, O Lord, for the honour of your name: for again and again we have been turned away from you, we have done evil against you.
- Darby Translation (DBY)
- Jehovah, though our iniquities testify against us, do thou act for thy name's sake; for our backslidings are many — we have sinned against thee.
- Webster's Bible (WBS)
- O LORD, though our iniquities testify against us, do thou [it] for thy name's sake: for our backslidings are many; we have sinned against thee.
- Young's Literal Translation (YLT)
- Surely our iniquities have testified against us, O Jehovah, work for Thy name's sake, For many have been our backslidings, Against Thee we have sinned.
Read in context
- 5లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టు చున్నవి.
- 6అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించు చున్నవి.
- 7యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితివిు; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
- 8ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;
- 9భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరుని వలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.
Cross references
- Psalm 25:11 కీర్తనలు 25:11యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
- Jeremiah 14:20–21 యిర్మీయా 14:20–21యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరోధముగా పాపము చేసియున్నాము. నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్ఠపరచకుమీ.
- Hosea 5:5 హోషేయ 5:5ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రాయిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లు చున్నారు.
- Jeremiah 5:6 యిర్మీయా 5:6వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
- Isaiah 59:12 యెషయా 59:12మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.
- Daniel 9:5–16 దానియేలు 9:5–16మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయదేశజనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితివిు; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు. ఆయన తన దాసులగు ప్రవక్తలద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతివిు. ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మ శాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము. ప్రభువా, మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
- Jeremiah 2:19 యిర్మీయా 2:19నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయ భక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగు నని నీవు తెలిసికొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Hosea 7:10 హోషేయ 7:10ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.
- Nehemiah 9:33–34 నెహెమ్యా 9:33–34మా మీదికి వచ్చిన శ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతివిు. మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.
- Ephesians 1:12 ఎఫెసీయులకు 1:12దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
- Psalm 115:1 కీర్తనలు 115:1మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
- Ephesians 1:6 ఎఫెసీయులకు 1:6మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.