Isaiah · chapter 2 · verse 16
Isaiah 2:16 in Telugu
తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.
Tarsheeshu odalakannitikini ramyamaina vichitra vastuvula kannitikini aa dinamu niyamimpabadiyunnadi.
Isaiah 2:16 in English
- King James Version (KJV)
- And upon all the ships of Tarshish, and upon all pleasant pictures.
- World English Bible (WEB)
- for all the ships of Tarshish, and for all pleasant imagery.
- American Standard Version (ASV)
- and upon all the ships of Tarshish, and upon all pleasant imagery.
- Bible in Basic English (BBE)
- And on all the ships of Tarshish, and on all the fair boats.
- Darby Translation (DBY)
- and upon all the ships of Tarshish, and upon all pleasant works of art.
- Webster's Bible (WBS)
- And upon all the ships of Tarshish, and upon all pleasant pictures.
- Young's Literal Translation (YLT)
- And for all ships of Tarshish, And for all desirable pictures.
Read in context
- 14ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని
- 15ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును
- 16తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.
- 17అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
- 18విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
Cross references
- 1 Kings 10:22 1 రాజులు 10:22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
- Isaiah 23:1 యెషయా 23:1తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.
- Numbers 33:52 సంఖ్యాకాండము 33:52ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి
- 1 Kings 22:48–49 1 రాజులు 22:48–49యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను. అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషా పాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.
- Psalm 47:7 కీర్తనలు 47:7దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
- Revelation 18:11 ప్రకటన 18:11లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను,
- Isaiah 60:9 యెషయా 60:9నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
- Revelation 18:17–19 ప్రకటన 18:17–19ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.