Isaiah · chapter 21 · verse 11
Isaiah 21:11 in Telugu
దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
Doomaanugoorchina devokti kaavalivaadaa, raatri yenta velainadi? Kaavalivaadaa, raatri yenta velainadi? Ani yokadu sheyeerulonundi kekalu vesi nannu aduguchunnaadu
Isaiah 21:11 in English
- King James Version (KJV)
- The burden of Dumah. He calleth to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?
- World English Bible (WEB)
- The burden of Dumah. One calls to me out of Seir, “Watchman, what of the night? Watchman, what of the night?”
- American Standard Version (ASV)
- The burden of Dumah. One calleth unto me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?
- Bible in Basic English (BBE)
- The word about Edom. A voice comes to me from Seir, Watchman, how far gone is the night? how far gone is the night?
- Darby Translation (DBY)
- The burden of Dumah. He calleth to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?
- Webster's Bible (WBS)
- The burden of Dumah. He calleth to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?
- Young's Literal Translation (YLT)
- The burden of Dumah. Unto me is [one] calling from Seir 'Watchman, what of the night? Watchman, what of the night?'
Read in context
- 9ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడుముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.
- 10నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.
- 11దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
- 12కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.
- 13అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.
Cross references
- Genesis 25:14 ఆదికాండము 25:14మిష్మా దూమానమశ్శా
- Obadiah 1:1–16 ఓబద్యా 1:1–16ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడానన్ను క్రిందికి పడ ద్రోయగలవాడె వడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు. తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసు లందరు హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూష లేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు; నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు; వారిలో తప్పించుకొనినవారిని సంహ రించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదిన మందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు. యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.
- Amos 1:6 ఆమోసు 1:6యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
- Joel 3:19 యోవేలు 3:19ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన యెడారిగా ఉండును.
- Jeremiah 49:7–22 యిర్మీయా 49:7–22సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి. ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా? నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును. అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు. యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు. సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి? ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
- Isaiah 63:1–6 యెషయా 63:1–6రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.
- Psalm 137:7 కీర్తనలు 137:7యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.
- Jeremiah 37:17 యిర్మీయా 37:17అతని తన యింటికి పిలిపించి యెహోవాయొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని యడుగగా యిర్మీయా - నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.
- Isaiah 21:6 యెషయా 21:6నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.
- Malachi 1:2–4 మలాకీ 1:2–4యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరుఏ విషయమందు నీవు మాయెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.
- 1 Chronicles 1:30 1 దినవృత్తాంతములు 1:30మిష్మా దూమా మశ్శా హదదు తేమా
- Deuteronomy 2:5 ద్వితీయోపదేశకాండము 2:5వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చి యున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను.