Isaiah · chapter 29 · verse 3
Isaiah 29:3 in Telugu
నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.
Nenu neeto yuddhamucheyuchu neechuttu shibiramu veyudunu. Neekedurugaa kota katti muttadi dibba veyudunu.
Isaiah 29:3 in English
- King James Version (KJV)
- And I will camp against thee round about, and will lay siege against thee with a mount, and I will raise forts against thee.
- World English Bible (WEB)
- I will encamp against you all around you, and will lay siege against you with posted troops. I will raise siege works against you.
- American Standard Version (ASV)
- And I will encamp against thee round about, and will lay siege against thee with posted troops, and I will raise siege works against thee.
- Bible in Basic English (BBE)
- And I will make war on you like David, and you will be shut in by earthworks, and I will make towers round you.
- Darby Translation (DBY)
- And I will camp against thee round about, and will lay siege against thee with watch-posts, and I will raise forts against thee.
- Webster's Bible (WBS)
- And I will encamp against thee round about, and will lay siege against thee with a mount, and I will raise forts against thee.
- Young's Literal Translation (YLT)
- And I encamped, O babbler, against thee, And I laid siege against thee — a camp. And I raised up against thee bulwarks.
Read in context
- 1అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.
- 2నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.
- 3నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.
- 4అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
- 5నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.
Cross references
- Luke 19:43–44 లూకా 19:43–44(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
- Ezekiel 21:22 యెహెజ్కేలు 21:22యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్ర ములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మ ములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచు మనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.
- 2 Kings 24:11–12 2 రాజులు 24:11–12వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతు లును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
- 2 Kings 25:1–4 2 రాజులు 25:1–4అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడివేయబడియుండగా నాల్గవ నెల తొమ్మిదవ దిన మందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.
- 2 Kings 19:32 2 రాజులు 19:32కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
- Matthew 22:7 మత్తయి 22:7కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
- 2 Kings 18:17 2 రాజులు 18:17అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షా కేనును లాకీషు పట్టణమునుండి యెరూష లేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా