Isaiah · chapter 29 · verse 6
Isaiah 29:6 in Telugu
ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.
Urumutonu bhookampamutonu mahaa shabdamutonu sudigaali tupaanulatonu dahinchu agnijvaalala tonu sainyamulakadhipatiyagu yehovaa daani shikshinchunu.
Isaiah 29:6 in English
- King James Version (KJV)
- Thou shalt be visited of the LORD of hosts with thunder, and with earthquake, and great noise, with storm and tempest, and the flame of devouring fire.
- World English Bible (WEB)
- She will be visited by the LORD of Armies with thunder, with earthquake, with great noise, with whirlwind and storm, and with the flame of a devouring fire.
- American Standard Version (ASV)
- She shall be visited of Jehovah of hosts with thunder, and with earthquake, and great noise, with whirlwind and tempest, and the flame of a devouring fire.
- Bible in Basic English (BBE)
- The Lord of armies will come in with thunder and earth-shaking and great noise, with rushing wind and storm, and the flame of burning fire.
- Darby Translation (DBY)
- Thou shalt be visited by Jehovah of hosts with thunder and with earthquake and great noise, with whirlwind and tempest, and the flame of devouring fire.
- Webster's Bible (WBS)
- Thou shalt be visited by the LORD of hosts with thunder, and with earthquake, and great noise, with storm and tempest, and the flame of devouring fire.
- Young's Literal Translation (YLT)
- By Jehovah of Hosts thou art inspected, With thunder, and with an earthquake, And great noise, hurricane, and whirlwind, And flame of devouring fire.
Read in context
- 4అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
- 5నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.
- 6ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.
- 7అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.
- 8ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.
Cross references
- Mark 13:8 మార్కు 13:8జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకుప్రారంభము.
- Revelation 16:18 ప్రకటన 16:18అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
- Matthew 24:7 మత్తయి 24:7జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
- 1 Samuel 2:10 1 సమూయేలు 2:10యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
- Revelation 11:19 ప్రకటన 11:19మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
- Isaiah 30:30 యెషయా 30:30యెహోవా తన ప్రభావముగల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.
- Isaiah 5:26–30 యెషయా 5:26–30ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు. వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.
- 1 Samuel 12:17–18 1 సమూయేలు 12:17–18గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
- Luke 21:11 లూకా 21:11అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
- Revelation 11:13 ప్రకటన 11:13ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
- Isaiah 28:2 యెషయా 28:2ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.
- 2 Samuel 22:14 2 సమూయేలు 22:14యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.