Isaiah · chapter 6 · verse 9
Isaiah 6:9 in Telugu
ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
Aayananeevu poyi yee janulato itlanumu meeru nityamu vinuchunduru gaani grahimpakunduru; nityamu choochuchunduru gaani telisikonakunduru.
Isaiah 6:9 in English
- King James Version (KJV)
- And he said, Go, and tell this people, Hear ye indeed, but understand not; and see ye indeed, but perceive not.
- World English Bible (WEB)
- He said, “Go, and tell this people, ‘You hear indeed, but don’t understand. You see indeed, but don’t perceive.’
- American Standard Version (ASV)
- And he said, Go, and tell this people, Hear ye indeed, but understand not; and see ye indeed, but perceive not.
- Bible in Basic English (BBE)
- And he said, Go, and say to this people, You will go on hearing, but learning nothing; you will go on seeing, but without getting wiser.
- Darby Translation (DBY)
- And he said, Go; and thou shalt say unto this people, Hearing ye shall hear and shall not understand, and seeing ye shall see and shall not perceive.
- Webster's Bible (WBS)
- And he said, Go, and tell this people, Hear ye indeed, but understand not; and see ye indeed, but perceive not.
- Young's Literal Translation (YLT)
- And He saith, 'Go, and thou hast said to this people, Hear ye — to hear, and ye do not understand, And see ye — to see, and ye do not know.
Read in context
- 7ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను.
- 8అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా
- 9ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
- 10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- 11ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును
Cross references
- Matthew 13:14–15 మత్తయి 13:14–15మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
- Luke 8:10 లూకా 8:10ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి. )
- Mark 4:12 మార్కు 4:12వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
- John 12:40 యోహాను 12:40వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.
- Acts 28:26–27 అపొస్తలుల కార్యములు 28:26–27మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
- Romans 11:8 రోమీయులకు 11:8ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.
- Isaiah 29:13 యెషయా 29:13ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
- Isaiah 44:18–20 యెషయా 44:18–20వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.
- Isaiah 43:8 యెషయా 43:8కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి
- Isaiah 30:8–11 యెషయా 30:8–11రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.
- Jeremiah 15:1–2 యిర్మీయా 15:1–2అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము. మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెర కును పోవలెను.
- Exodus 32:7–10 నిర్గమకాండము 32:7–10కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా