Mark · chapter 4 · verse 12
Mark 4:12 in Telugu
వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
Velupalanunduvaaru okavela devunivaipu tirigi paapa kshamaapana pondudurani, vaaru choochutakaite choochiyu kanugonakanu, vinutakaite viniyu grahimpakayu nunduta kunu anniyu upamaanareetigaa vaariki bodhimpabaduchunna vani vaarito cheppenu
Mark 4:12 in English
- King James Version (KJV)
- That seeing they may see, and not perceive; and hearing they may hear, and not understand; lest at any time they should be converted, and [their] sins should be forgiven them.
- World English Bible (WEB)
- that ‘seeing they may see and not perceive, and hearing they may hear and not understand, lest perhaps they should turn again, and their sins should be forgiven them.’”
- American Standard Version (ASV)
- that seeing they may see, and not perceive; and hearing they may hear, and not understand; lest haply they should turn again, and it should be forgiven them.
- Bible in Basic English (BBE)
- So that seeing they may see, and it will not be clear to them; and hearing it, they will not get the sense; for fear that they may be turned again to me and have forgiveness.
- Darby Translation (DBY)
- that beholding they may behold and not see, and hearing they may hear and not understand, lest it may be, they should be converted and they should be forgiven.
- Webster's Bible (WBS)
- That seeing they may see, and not perceive; and hearing they may hear, and not understand; lest at any time they should be converted, and [their] sins should be forgiven them.
- Young's Literal Translation (YLT)
- that seeing they may see and not perceive, and hearing they may hear and not understand, lest they may turn, and the sins may be forgiven them.'
Read in context
- 10ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యులతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
- 11అందుకాయన దేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
- 12వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
- 13మరియుఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను.
- 14విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
Cross references
- Isaiah 6:9–10 యెషయా 6:9–10ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Isaiah 44:18 యెషయా 44:18వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.
- Matthew 13:14–15 మత్తయి 13:14–15మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
- Jeremiah 5:21 యిర్మీయా 5:21కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.
- Deuteronomy 29:4 ద్వితీయోపదేశకాండము 29:4అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.
- John 12:37–41 యోహాను 12:37–41యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.
- Luke 8:10 లూకా 8:10ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి. )
- 2 Timothy 2:25 2 తిమోతికి 2:25అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని,
- Hebrews 6:6 హెబ్రీయులకు 6:6తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
- Ezekiel 12:2 యెహెజ్కేలు 12:2నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడక యున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.
- Romans 11:8–10 రోమీయులకు 11:8–10ఇందువిషయమైనేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
- Jeremiah 31:18–20 యిర్మీయా 31:18–20నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడచరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.