Isaiah · chapter 7 · verse 11
Isaiah 7:11 in Telugu
నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.
Nee devudaina yehovaavalana soochana nadugumu. Adi paataalamanta lotainanu sare oorthvalokamanta ettayinanu sare.
Isaiah 7:11 in English
- King James Version (KJV)
- Ask thee a sign of the LORD thy God; ask it either in the depth, or in the height above.
- World English Bible (WEB)
- “Ask a sign of the LORD your God; ask it either in the depth, or in the height above.”
- American Standard Version (ASV)
- Ask thee a sign of Jehovah thy God; ask it either in the depth, or in the height above.
- Bible in Basic English (BBE)
- Make a request to the Lord your God for a sign, a sign in the deep places of the underworld, or in the high heavens.
- Darby Translation (DBY)
- Ask for thee a sign from Jehovah thy God; ask for it in the deep, or in the height above.
- Webster's Bible (WBS)
- Ask thee a sign from the LORD thy God; ask it either in the depth, or in the hight above.
- Young's Literal Translation (YLT)
- 'Ask for thee a sign from Jehovah thy God, Make deep the request, or make [it] high upwards.'
Read in context
- 9షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.
- 10యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను
- 11నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.
- 12ఆహాజునేను అడుగను యెహోవాను శోధింప నని చెప్పగా
- 13అతడుఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?
Cross references
- Isaiah 37:30 యెషయా 37:30మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.
- Isaiah 38:7–8 యెషయా 38:7–8యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవావలన నీకు కలిగిన సూచన; ఆహాజు ఎండ గడియారముమీద సూర్యుని కాంతిచేత దిగిన నీడ మరల పదిమెట్లు ఎక్క జేసెదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కెను.
- 2 Kings 19:29 2 రాజులు 19:29మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
- Isaiah 38:22 యెషయా 38:22మరియు హిజ్కియానేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.
- Judges 6:36–40 న్యాయాధిపతులు 6:36–40అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱె బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.
- 2 Kings 20:8–11 2 రాజులు 20:8–11యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ పదిమెట్లు ముందుకు నడిచెనుగదా? అది పదిమెట్లు వెనుకకు నడిచినయెడల అవునా? అందుకు హిజ్కియా యిట్లనెనునీడ పదిమెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహో వాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పదిమెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను.
- Matthew 12:38–40 మత్తయి 12:38–40అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరుబోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
- Jeremiah 19:10 యిర్మీయా 19:10ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను
- Jeremiah 51:63–64 యిర్మీయా 51:63–64ఈ గ్రంథమును చదివి చాలించినతరువాత నీవు దానికి రాయికట్టి యూఫ్రటీసునదిలో దాని వేసి నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
- Jeremiah 19:1 యిర్మీయా 19:1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- Matthew 16:1–4 మత్తయి 16:1–4అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.