Jeremiah · chapter 1 · verse 12
Jeremiah 1:12 in Telugu
యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.
Yehovaa neevu baagugaa kanipettitivi; nenu cheppina vaakyamunu neraverchutaku nenu aatura paduchunnaananenu.
Jeremiah 1:12 in English
- King James Version (KJV)
- Then said the LORD unto me, Thou hast well seen: for I will hasten my word to perform it.
- World English Bible (WEB)
- Then the LORD said to me, “You have seen well; for I watch over my word to perform it.”
- American Standard Version (ASV)
- Then said Jehovah unto me, Thou hast well seen: for I watch over my word to perform it.
- Bible in Basic English (BBE)
- Then the Lord said to me, You have seen well: for I keep watch over my word to give effect to it.
- Darby Translation (DBY)
- And Jehovah said unto me, Thou hast well seen; for I am watchful over my word to perform it.
- Webster's Bible (WBS)
- Then said the LORD to me, Thou hast well seen: for I will hasten my word to perform it.
- Young's Literal Translation (YLT)
- And Jehovah saith unto me, 'Thou hast well seen: for I am watching over My word to do it.'
Read in context
- 10పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.
- 11మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా
- 12యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.
- 13రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై - నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేనుమసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని.
- 14అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.
Cross references
- Ezekiel 12:28 యెహెజ్కేలు 12:28కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 12:25 యెహెజ్కేలు 12:25యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 12:22–23 యెహెజ్కేలు 12:22–23నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగు చున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును
- Luke 10:28 లూకా 10:28అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.
- Amos 8:2 ఆమోసు 8:2ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.
- Deuteronomy 5:28 ద్వితీయోపదేశకాండము 5:28మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెల విచ్చెనుఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.
- Deuteronomy 32:35 ద్వితీయోపదేశకాండము 32:35వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
- Deuteronomy 18:17 ద్వితీయోపదేశకాండము 18:17మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;