Jeremiah · chapter 17 · verse 10
Jeremiah 17:10 in Telugu
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
Okani pravartananubatti vaani kriyala phalamuchoppuna prati kaaramu cheyutaku yehovaa anu nenu hrudayamunu parishodhinchuvaadanu, antarindriyamulanu pareekshinchuvaadanu.
Jeremiah 17:10 in English
- King James Version (KJV)
- I the LORD search the heart, [I] try the reins, even to give every man according to his ways, [and] according to the fruit of his doings.
- World English Bible (WEB)
- “I, the LORD, search the mind. I try the heart, even to give every man according to his ways, according to the fruit of his doings.”
- American Standard Version (ASV)
- I, Jehovah, search the mind, I try the heart, even to give every man according to his ways, according to the fruit of his doings.
- Bible in Basic English (BBE)
- I the Lord am the searcher of the heart, the tester of the thoughts, so that I may give to every man the reward of his ways, in keeping with the fruit of his doings.
- Darby Translation (DBY)
- I Jehovah search the heart, I try the reins, even to give each one according to his ways, according to the fruit of his doings.
- Webster's Bible (WBS)
- I the LORD search the heart, [I] try the reins, even to give every man according to his ways, [and] according to the fruit of his doings.
- Young's Literal Translation (YLT)
- I Jehovah do search the heart, try the reins, Even to give to each according to his way, According to the fruit of his doings.
Read in context
- 8వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
- 9హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
- 10ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
- 11న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
- 12ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
Cross references
- 1 Samuel 16:7 1 సమూయేలు 16:7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
- Romans 8:27 రోమీయులకు 8:27మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.
- Jeremiah 11:20 యిర్మీయా 11:20నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
- Revelation 2:23 ప్రకటన 2:23దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘము లన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
- Hebrews 4:12–13 హెబ్రీయులకు 4:12–13ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- Psalm 139:23–24 కీర్తనలు 139:23–24దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
- Jeremiah 32:19 యిర్మీయా 32:19ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
- Jeremiah 20:12 యిర్మీయా 20:12సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించు చున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Galatians 6:7–8 గలతీయులకు 6:7–8మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.
- Proverbs 17:3 సామెతలు 17:3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
- Psalm 62:12 కీర్తనలు 62:12ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.