Jeremiah · chapter 21 · verse 12
Jeremiah 21:12 in Telugu
దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
Daaveedu vanshasthulaaraa, yehovaa eelaagu selavichchuchunnaadu anudinamu nyaayamugaa teerpu teerchudi, dochukonabadinavaanini baadhapettuvaani chetilonundi vidipinchudi, aalaagu cheyaniyedala mee dushtakriyalanubatti naa krodhamu agnivale bayaluvedali, yevadunu aarpalekunda mimmunu dahinchunu.
Jeremiah 21:12 in English
- King James Version (KJV)
- O house of David, thus saith the LORD; Execute judgment in the morning, and deliver [him that is] spoiled out of the hand of the oppressor, lest my fury go out like fire, and burn that none can quench [it], because of the evil of your doings.
- World English Bible (WEB)
- House of David, the LORD says, ‘Execute justice in the morning, and deliver him who is robbed out of the hand of the oppressor, lest my wrath go out like fire, and burn so that no one can quench it, because of the evil of your doings.
- American Standard Version (ASV)
- O house of David, thus saith Jehovah, Execute justice in the morning, and deliver him that is robbed out of the hand of the oppressor, lest my wrath go forth like fire, and burn so that none can quench it, because of the evil of your doings.
- Bible in Basic English (BBE)
- O family of David, this is what the Lord has said: Do what is right in the morning, and make free from the hands of the cruel one him whose goods have been violently taken away, or my wrath will go out like fire, burning so that no one may put it out, because of the evil of your doings.
- Darby Translation (DBY)
- House of David, thus saith Jehovah: Judge with justice in the morning, and deliver him that is spoiled out of the hand of the oppressor, lest my fury go forth like fire and burn, and there be none to quench it, because of the evil of your doings.
- Webster's Bible (WBS)
- O house of David, thus saith the LORD; Execute judgment in the morning, and deliver [him that is] made desolate out of the hand of the oppressor, lest my fury go out like fire, and burn that none can quench [it] , because of the evil of your doings.
- Young's Literal Translation (YLT)
- O house of David, thus said Jehovah: Decide ye judgment at morning, And deliver the plundered from the hand of the oppressor, Lest My fury go forth as fire, And hath burned, and none is quenching, Because of the evil of your doings.
Read in context
- 10ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
- 11యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే యెహోవా మాట వినుడి.
- 12దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
- 13యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువార లారా,
- 14మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Isaiah 1:17 యెషయా 1:17కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.
- Jeremiah 4:4 యిర్మీయా 4:4అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
- Proverbs 31:8–9 సామెతలు 31:8–9మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.
- Zechariah 7:9–11 జెకర్యా 7:9–11సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి. విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయ మందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ దలచకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.
- Isaiah 1:31 యెషయా 1:31బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.
- Jeremiah 22:2–3 యిర్మీయా 22:2–3దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
- Nahum 1:6 నహూము 1:6ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
- Ezekiel 20:47–48 యెహెజ్కేలు 20:47–48దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును.
- Jeremiah 36:7 యిర్మీయా 36:7ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.
- Jeremiah 5:28 యిర్మీయా 5:28వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయు చున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.
- Jeremiah 17:4 యిర్మీయా 17:4మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు.
- Zephaniah 3:5 జెఫన్యా 3:5అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు
Original words (Hebrew)
- house · H1004בַּיִת bayith
- David · H1732דָּוִד Dâvid
- saith · H559אָמַר ʼâmar
- Execute · H1777דִּין dîyn
- judgment · H4941מִשְׁפָּט mishpâṭ
- morning · H1242בֹּקֶר bôqer
- deliver · H5337נָצַל nâtsal
- spoiled · H1497גָּזַל gâzal
- hand · H3027יָד yâd
- oppressor · H6231עָשַׁק ʻâshaq
- fury · H2534חֵמָה chêmâh
- out · H3318יָצָא yâtsâʼ
- fire · H784אֵשׁ ʼêsh
- burn · H1197בָּעַר bâʻar
- quench · H3518כָּבָה kâbâh
- because · H6440פָּנִים pânîym
- evil · H7455רֹעַ rôaʻ
- doings · H4611מַעֲלָל maʻălâl