Jeremiah · chapter 24 · verse 10
Jeremiah 24:10 in Telugu
నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.
Nenu vaarikini vaari pitarulakunu ichchina deshamulo undakunda vaaru paadaipovuvaraku nenu khadgamunu kshaamamunu tegulunu vaariloki pampedanu.
Jeremiah 24:10 in English
- King James Version (KJV)
- And I will send the sword, the famine, and the pestilence, among them, till they be consumed from off the land that I gave unto them and to their fathers.
- World English Bible (WEB)
- I will send the sword, the famine, and the pestilence among them, until they are consumed from off the land that I gave to them and to their fathers.’”
- American Standard Version (ASV)
- And I will send the sword, the famine, and the pestilence, among them, till they be consumed from off the land that I gave unto them and to their fathers.
- Bible in Basic English (BBE)
- And I will send the sword, and need of food, and disease, among them till they are all cut off from the land which I gave to them and to their fathers.
- Darby Translation (DBY)
- and I will send among them the sword, the famine, and the pestilence, until they be consumed from off the land that I gave unto them and to their fathers.
- Webster's Bible (WBS)
- And I will send the sword, the famine, and the pestilence, among them, till they are consumed from off the land that I gave to them and to their fathers.
- Young's Literal Translation (YLT)
- And I have sent against them the sword, The famine and the pestilence, Till their consumption from off the ground, That I gave to them and to their fathers!
Read in context
- 8మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 9మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదము గాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
- 10నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.
Cross references
- Isaiah 51:19 యెషయా 51:19ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.
- Jeremiah 19:7 యిర్మీయా 19:7తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.
- Ezekiel 5:12–17 యెహెజ్కేలు 5:12–17కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
- Jeremiah 14:15–16 యిర్మీయా 14:15–16కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించె దను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.
- Ezekiel 33:27 యెహెజ్కేలు 33:27నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.
- Jeremiah 16:4 యిర్మీయా 16:4వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంట వలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.
- Jeremiah 5:12 యిర్మీయా 5:12వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
- Jeremiah 15:2 యిర్మీయా 15:2మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెర కును పోవలెను.
- Ezekiel 14:12–21 యెహెజ్కేలు 14:12–21మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేము మీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు
- Ezekiel 7:15 యెహెజ్కేలు 7:15బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును.
- Jeremiah 34:17 యిర్మీయా 34:17కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలెనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే; ఆలోచించుడి, విడుదల కావలెనని నేనే చాటించుచున్నాను, అది ఖడ్గ క్షామసంకటముల పాలగుటకైన విడుదలయే; భూరాజ్యము లన్నిటిలోను ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము నప్పగించుచున్నాను.
- Jeremiah 9:16 యిర్మీయా 9:16తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గ మును పంపుదును.