Jeremiah · chapter 5 · verse 12
Jeremiah 5:12 in Telugu
వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
Vaarupalukuvaadu yehovaa kaadaniyu aayana ledaniyu, keedu manaku raadaniyu, khadgamunainanu karavunainanu chooda maniyu,
Jeremiah 5:12 in English
- King James Version (KJV)
- They have belied the LORD, and said, [It is] not he; neither shall evil come upon us; neither shall we see sword nor famine:
- World English Bible (WEB)
- They have denied the LORD, and said, “It is not he. Evil won’t come on us. We won’t see sword or famine.
- American Standard Version (ASV)
- They have denied Jehovah, and said, It is not he; neither shall evil come upon us; neither shall we see sword nor famine:
- Bible in Basic English (BBE)
- They would have nothing to do with the Lord, saying, He will do nothing, and no evil will come to us; we will not see the sword or be short of food:
- Darby Translation (DBY)
- They have denied Jehovah, and say, He is not; and evil shall not come upon us, nor shall we see sword nor famine;
- Webster's Bible (WBS)
- They have belied the LORD, and said, [It is] not he; neither shall evil come upon us; neither shall we see sword nor famine:
- Young's Literal Translation (YLT)
- They have lied against Jehovah, And they say, '[It is] not He, Nor come in against us doth evil, Yea, sword and famine we do not see.
Read in context
- 10దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.
- 11ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.
- 12వారుపలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,
- 13ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
- 14కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- 2 Chronicles 36:16 2 దినవృత్తాంతములు 36:16పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
- Jeremiah 43:2–3 యిర్మీయా 43:2–3హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును, బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింప వలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)
- Jeremiah 28:15–17 యిర్మీయా 28:15–17అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెనుహనన్యా వినుము;యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
- Ezekiel 12:22–28 యెహెజ్కేలు 12:22–28నరపుత్రుడా దినములు జరిగి పోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగు చున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదె గాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొను చున్నారు గదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.
- Deuteronomy 29:19 ద్వితీయోపదేశకాండము 29:19అట్టి పనులను చేయు వాడు ఈ శాపవాక్య ములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చు కొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
- Jeremiah 14:13–14 యిర్మీయా 14:13–14అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా యెహోవా నాతో ఇట్లనెనుప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.
- Isaiah 28:14–15 యెషయా 28:14–15కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.
- Psalm 10:6 కీర్తనలు 10:6మేము కదల్చబడము, తరతరములవరకు ఆపదచూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
- Jeremiah 23:14–17 యిర్మీయా 23:14–17యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
- Jeremiah 28:4 యిర్మీయా 28:4బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 5:31 యిర్మీయా 5:31ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
- 1 Samuel 6:9 1 సమూయేలు 6:9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.