Jeremiah · chapter 26 · verse 24
Jeremiah 26:24 in Telugu
ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.
Eelaagu jarugagaa shaaphaanu kumaarudaina aheekaamu yirmeeyaaku todaiyunnanduna atani champutaku vaaru janula chetiki atanini appagimpaledu.
Jeremiah 26:24 in English
- King James Version (KJV)
- Nevertheless the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, that they should not give him into the hand of the people to put him to death.
- World English Bible (WEB)
- But the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, so that they didn’t give him into the hand of the people to put him to death.
- American Standard Version (ASV)
- But the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, that they should not give him into the hand of the people to put him to death.
- Bible in Basic English (BBE)
- But Ahikam, the son of Shaphan, gave Jeremiah his help, so that he was not given into the hands of the people to be put to death.
- Darby Translation (DBY)
- — Nevertheless the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, that they should not give him into the hand of the people to put him to death.
- Webster's Bible (WBS)
- Nevertheless the hand of Ahikam the son of Shaphan was with Jeremiah, that they should not give him into the hand of the people to put him to death.
- Young's Literal Translation (YLT)
- Only, the hand of Ahikam son of Shaphan hath been with Jeremiah so as not to give him up into the hand of the people to put him to death.
Read in context
- 22అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;
- 23వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసి కొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.
- 24ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.
Cross references
- 1 Kings 18:4 1 రాజులు 18:4యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
- Jeremiah 1:18–19 యిర్మీయా 1:18–19యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.
- 2 Kings 22:12–14 2 రాజులు 22:12–14తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
- Jeremiah 40:5–7 యిర్మీయా 40:5–7ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించి యున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను. అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.
- Jeremiah 39:14 యిర్మీయా 39:14బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారు డైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.
- Isaiah 37:32–33 యెషయా 37:32–33శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును. కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.
- Acts 27:43 అపొస్తలుల కార్యములు 27:43శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించివారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు
- Acts 25:3–4 అపొస్తలుల కార్యములు 25:3–4మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తుపౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను
- 2 Kings 25:22 2 రాజులు 25:22బబు లోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారిమీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను.
- Jeremiah 15:15–21 యిర్మీయా 15:15–21యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసి కొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.
- 2 Chronicles 34:20 2 దినవృత్తాంతములు 34:20హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
- Acts 23:10 అపొస్తలుల కార్యములు 23:10కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.