Jeremiah · chapter 36 · verse 6
Jeremiah 36:6 in Telugu
కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.
Kaabatti neevu velli upavaasadinamuna yehovaa mandiramulo prajalaku vinabadunatlu nenu cheppagaa neevu pustakamulo vraasina yehovaa maatalanu chadivi vinipinchumu, tama pattanamulanundi vachchu yoodaa janulandarikini vinabadunatlugaa vaatini chadivi vinipimpavalenu.
Jeremiah 36:6 in English
- King James Version (KJV)
- Therefore go thou, and read in the roll, which thou hast written from my mouth, the words of the LORD in the ears of the people in the LORD’s house upon the fasting day: and also thou shalt read them in the ears of all Judah that come out of their cities.
- World English Bible (WEB)
- Therefore you go, and read from the scroll which you have written from my mouth, the LORD’s words, in the ears of the people in the LORD’s house on the fast day. Also you shall read them in the ears of all Judah who come out of their cities.
- American Standard Version (ASV)
- therefore go thou, and read in the roll, which thou hast written from my mouth, the words of Jehovah in the ears of the people in Jehovah’s house upon the fast-day; and also thou shalt read them in the ears of all Judah that come out of their cities.
- Bible in Basic English (BBE)
- So you are to go, reading there from the book, which you have taken down from my mouth, the words of the Lord, in the hearing of the people in the Lord's house, on a day when they go without food, and in the hearing of all the men of Judah who have come out from their towns.
- Darby Translation (DBY)
- and read in the roll, which thou hast written from my mouth, the words of Jehovah in the ears of the people in the house of Jehovah upon the fast day; and thou shalt also read them in the ears of all Judah that come from their cities.
- Webster's Bible (WBS)
- Therefore go thou and read in the roll, which thou hast written from my mouth, the words of the LORD in the ears of the people in the LORD'S house upon the day of fasting: and also thou shalt read them in the ears of all Judah that come out of their cities.
- Young's Literal Translation (YLT)
- but thou hast entered — and thou hast read in the roll that thou hast written from my mouth, the words of Jehovah, in the ears of the people, in the house of Jehovah, in the day of the fast, and also in the ears of all Judah who are coming in from their cities thou dost read them;
Read in context
- 4యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.
- 5యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను నేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.
- 6కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.
- 7ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.
- 8ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను.
Cross references
- Jeremiah 36:8–9 యిర్మీయా 36:8–9ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను. యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా
- Leviticus 16:29–31 లేవీయకాండము 16:29–31ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.
- Jeremiah 7:2 యిర్మీయా 7:2నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.
- Jeremiah 26:2 యిర్మీయా 26:2యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.
- Jeremiah 22:2 యిర్మీయా 22:2దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.
- Ezekiel 2:3–7 యెహెజ్కేలు 2:3–7ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు. వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లు - ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు; అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగు బాటు చేయువారు వారికి భయపడకుము.
- Leviticus 23:27–32 లేవీయకాండము 23:27–32ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘ ముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖ పరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయం కాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.
- Jeremiah 19:14 యిర్మీయా 19:14ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.
- Acts 27:9 అపొస్తలుల కార్యములు 27:9చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.
- Jeremiah 18:11 యిర్మీయా 18:11కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము యెహోవా సెలవిచ్చినమాట ఏదనగా మీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్టమార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.
Original words (Hebrew)
- go · H935בּוֹא bôwʼ
- read · H7121קָרָא qârâʼ
- roll · H4039מְגִלָּה mᵉgillâh
- written · H3789כָּתַב kâthab
- mouth · H6310פֶּה peh
- words · H1697דָּבָר dâbâr
- ears · H241אֹזֶן ʼôzen
- people · H5971עַם ʻam
- house · H1004בַּיִת bayith
- fasting · H6685צוֹם tsôwm
- day · H3117יוֹם yôwm
- read · H7121קָרָא qârâʼ
- ears · H241אֹזֶן ʼôzen
- Judah · H3063יְהוּדָה Yᵉhûwdâh
- out · H935בּוֹא bôwʼ
- cities · H5892עִיר ʻîyr