Jeremiah · chapter 4 · verse 25
Jeremiah 4:25 in Telugu
నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
Nenu choodagaa narudokadunu lekapoyenu, aakaashapakshulanniyu egiripoyiyundenu.
Jeremiah 4:25 in English
- King James Version (KJV)
- I beheld, and, lo, [there was] no man, and all the birds of the heavens were fled.
- World English Bible (WEB)
- I saw, and behold, there was no man, and all the birds of the sky had fled.
- American Standard Version (ASV)
- I beheld, and, lo, there was no man, and all the birds of the heavens were fled.
- Bible in Basic English (BBE)
- Looking, I saw that there was no man, and all the birds of heaven had gone in flight.
- Darby Translation (DBY)
- I beheld, and lo, man was not, and all the fowl of the heavens were fled.
- Webster's Bible (WBS)
- I beheld, and lo, [there was] no man, and all the fowls of the heavens had fled.
- Young's Literal Translation (YLT)
- I have looked, and lo, man is not, And all fowls of the heavens have fled.
Read in context
- 23నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
- 24పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
- 25నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షులన్నియు ఎగిరిపోయియుండెను.
- 26నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
- 27యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.
Cross references
- Zephaniah 1:2–3 జెఫన్యా 1:2–3ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరును లేకుండ మనుష్య జాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 12:4 యిర్మీయా 12:4భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవు చున్నవి.
- Jeremiah 9:10 యిర్మీయా 9:10పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.
- Hosea 4:3 హోషేయ 4:3కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.