Jeremiah · chapter 46 · verse 5
Jeremiah 46:5 in Telugu
నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
Naakemi kanabaduchunnadi? Vaaru odipovuchunnaaru venukateeyuchunnaaru vaari balaadhyulu apajayamu nonduchunnaaru tirigichoodaka vegiramugaa paaripovuchunnaaru etuchoochina bhayame; yehovaa maata yide.
Jeremiah 46:5 in English
- King James Version (KJV)
- Wherefore have I seen them dismayed [and] turned away back? and their mighty ones are beaten down, and are fled apace, and look not back: [for] fear [was] round about, saith the LORD.
- World English Bible (WEB)
- Why have I seen it? They are dismayed and are turned backward. Their mighty ones are beaten down, have fled in haste, and don’t look back. Terror is on every side,” says the LORD.
- American Standard Version (ASV)
- Wherefore have I seen it? they are dismayed and are turned backward; and their mighty ones are beaten down, and are fled apace, and look not back: terror is on every side, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- What have I seen? they are overcome with fear and turned back; their men of war are broken and have gone in flight, not looking back: fear is on every side, says the Lord.
- Darby Translation (DBY)
- Why do I see them dismayed, turned away back? And their mighty ones are beaten down, and take to flight, and look not back? Terror [is] on every side, saith Jehovah.
- Webster's Bible (WBS)
- Why have I seen them dismayed [and] turned away back? and their mighty ones are beaten down, and have fled apace, and look not back: [for] fear [was] on all sides, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- Wherefore have I seen them dismayed — They are turned backward, And their mighty ones are beaten down, And [to] a refuge they have fled, and not turned the face? Fear [is] round about — an affirmation of Jehovah.
Read in context
- 3డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి
- 4గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.
- 5నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
- 6త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.
- 7నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి
Cross references
- Jeremiah 6:25 యిర్మీయా 6:25పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.
- Jeremiah 49:29 యిర్మీయా 49:29వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు
- Jeremiah 46:21 యిర్మీయా 46:21పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
- Isaiah 19:16 యెషయా 19:16ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.
- Jeremiah 20:10 యిర్మీయా 20:10నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.
- Revelation 6:15–17 ప్రకటన 6:15–17భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
- Jeremiah 20:3–4 యిర్మీయా 20:3–4మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడి పింపగా యిర్మీయా అతనితో ఇట్లనెనుయెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచు చుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసి కొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.
- Ezekiel 32:10 యెహెజ్కేలు 32:10నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.
- Genesis 19:17 ఆదికాండము 19:17ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా
- Nahum 2:8 నహూము 2:8కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు.
- Jeremiah 46:15 యిర్మీయా 46:15నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడు చున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.
- 2 Kings 7:6–7 2 రాజులు 7:6–7యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారుమనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి యున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.